June 7, 2023

నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ల దూకుడు- OTT ఫ్లాట్‌ఫాంలే ఎంటర్‌టైన్‌మెంట్‌ కింగ్‌లు…

నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ల దూకుడు- OTT ఫ్లాట్‌ఫాంలే ఎంటర్‌టైన్‌మెంట్‌ కింగ్‌లు…

సినిమా థియేటర్లకు గడ్డు కాలం వచ్చే రోజులు దగ్గర పడినట్టే కనిపిస్తున్నాయి. వరల్ట్‌ టాప్‌ OTT ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్‌ లేటెస్ట్‌గా రిలీజ్‌ చేసిన వ్యూయర్స్‌ రిపోర్ట్‌ చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌లు పెద్ద సవాల్‌ విసురుతున్నాయి. త్వరలో యాపిల్‌ కూడా ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ రంగంలోకి దూసుకొస్తోంది. అదీ వేల కోట్ల పెట్టుబడితో OTT రంగంలోకి వస్తోంది. OTT అంటే ఓవర్‌ ది టాప్‌అంటేఎమ్‌ఎస్‌వోలు, కేబుల్‌ కనెక్షన్లతో సంబంధం లేకుండా నేరుగా ఇంటర్నెట్‌తో ప్రసారాలు సాగించే ఆన్‌లైన్‌ వ్యవస్థలు. ఇప్పటికే ఇంటర్‌నెట్‌ బేస్‌డ్‌ స్మార్ట్‌ టీవీలు దూసుకుపోతున్నాయిజియో ఫైబర్‌ పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి వస్తేవచ్చే రెండేళ్లలో స్మార్‌ టీవీ యుగమే. ఇలాంటి పరిస్థితుల్లో నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసిన లెక్కలు చూస్తేఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ సైట్ల ఆధిపత్యానికి ఆ రెండేళ్లు కూడా అవసరం లేదేమో అనిపిస్తోంది. అక్టోబర్‌ 2018 నుంచి సెప్టెంబర్‌ 2019 వరకు సరిగ్గా ఏడాది కాలానికి నెట్‌ఫ్లిక్స్‌ తమ రేటింగ్స్‌ని రిలీజ్‌ చేసింది. నెట్‌ఫ్లిక్స్‌కి ఇండియాలో కూడా సూపర్‌ ఫాలోయింగ్‌ ఉంది. మొబైల్‌లో మాత్రమే చూసేవారికి నెలకు 200 రూపాయలకే స్ట్రీమింగ్‌ కూడా అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్స్‌లో స్ట్రేంజర్‌ థింగ్స్‌ సీరీస్‌ని ఏకంగా 64 మిలియన్స్‌ అంటే… 6 కోట్ల 40 లక్షల మంది చూశారు. అంబ్రెల్లా అకాడమీ, మనీ హీస్ట్‌, యూ సిరీస్‌లను 4 కోట్ల పైనే చూశారు. యావరేజ్‌న ఒక్కో సిరీస్‌ మినిమమ్‌ 2 కోట్ల మంది చూసినట్టు నెట్‌ఫ్లిక్స్‌ లెక్కలు బయటపెట్టింది. ఇక సినిమా స్ట్రీమింగ్‌లోనూ ఇదే దూకుడు. ప్రస్తుతానికి ఇంగ్లీష్‌, హిందీ సినిమాలపైనే నెట్‌ఫ్లిక్స్‌ ఎక్కువగా దృష్టి పెట్టింది. లోకల్ సినిమాల విషయంలో మాత్రం అమెజాన్‌ కింగ్‌. నెట్‌ఫ్లిక్స్‌లో బర్డ్‌బాక్స్, మర్డర్‌ మిస్టరీ మూవీలను చెరి 8 కోట్ల మంది చూశారు. ట్రిపిల్‌ ఫ్రాంటియర్‌, ది పరఫెక్ట్‌ డేట్‌ మూవీలను చెరి 5 కోట్ల మంది చూశారు. నిజానికి ఈ సినిమాలు బాక్స్‌ ఆఫీస్‌ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ.. నెట్‌ఫ్లిక్స్‌ సూపర్‌ హిట్‌ అవడం విశేషం. ఈ లెక్కలన్నీ చూస్తే అమెజాన్‌లో ఇండియన్‌ లాంగ్వేజ్‌ మూవీస్‌ వ్యూస్‌ లెక్కలు తీస్తేఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ అసలు సత్తా బయటపడుతుంది. నెలలో ఒకసారి సినిమాకి ఫ్యామిలీతో వెళ్తే అయ్యే ఖర్చులో సగానికే నెట్‌ఫ్లిక్స్‌ వస్తోంది. అమెజాన్ అయితే మరీ తక్కువ. హాట్‌స్టార్‌, సన్‌ NXT, జీ 5ల రేట్లు కూడా తక్కువే. యూట్యూబ్‌ అయితే పూర్తిగా ఫ్రీ. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానళ్లు నెమ్మదిగా ఓటీటీ ఫ్లాట్‌ఫాం వైపు వచ్చేస్తున్నాయి. టీవీలు చూసే టైం తగ్గిపోతోంది, స్మార్ట్‌ఫోన్‌లలోనే పని అయిపోతోంది. ఇక థియేటర్లకు వెళ్లే టైం కూడా రాను రాను తగ్గిపోతోంది. ఒకప్పుడు హండ్రెడ్‌ డేస్‌ అనేవారు, ఇప్పుడు 10 రోజులు నిలకడగా సినిమా థియేటర్లలో ఉంటే గొప్ప. ఆ పది రోజులు మాత్రం హడావిడి టెన్షన్‌ ఎందుకు అనే రోజులు కూడా వచ్చేటట్టున్నాయి. ఓటీటీల్లో ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌తో కొత్త సినిమాలను హాయిగా ఇంట్లోనే చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. థియేటర్లలో వేలకు వేలు జేబులు గుల్ల చేసుకునే కన్నాప్రైమ్‌ వీడియోలో చూడ్డం బెటరనుకుంటున్నారు ఆడియన్స్‌. బాహుబలి, సైరా, సాహో లాంటి భారీ సినిమాలైతే థియేటర్లకు కదులుతున్నారు గానీ, చిన్నా చితకా సినిమాలకు థియేటర్లకు వెళ్లడం తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే OTTలకు గేట్స్‌ తెరుచుకున్నాయి. దూసుకుపోతున్నాయి.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *