September 21, 2023

న్యూయార్క్‌లో 9/11 మరణాల కంటే ఎక్కువ !

న్యూయార్క్‌లో 9/11 మరణాల కంటే ఎక్కువ !

బహుశా మరో పదేళ్ల వరకు కరోనాని అమెరికా మర్చిపోలేదు. ముఖ్యంగా అమెరికా హార్ట్‌బీట్‌ న్యూయార్క్‌ని కరోనా కుదిపేస్తోంది. 2001 ఉగ్రదాడుల కంటే ఎక్కువగా న్యూయార్క్‌లో మరణాలు సంభవించాయని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక చెప్తోంది. ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ట్రంప్‌ తలపట్టుకున్నారు.సరైన టైంలో సరైన లాక్‌డౌన్‌ లాంటి సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలు వచ్చాయని వైద్య నిపుణులు మండిపడుతున్నారు. రోజు రోజుకి అమెరికాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఒక్క న్యూయార్క్‌ స్టేట్‌లో మరణాలు 5 వేవలు దాటిపోయాయి. ఇది 2001లో సెప్టెంబర్‌ 11న జరిగిన టెర్రర్‌ అటాక్‌ మరణాల కంటే ఎక్కువ. న్యూయార్క్‌, మన ఇండియన్స్‌ ఫేవరేట్‌ సిటీ న్యూజెర్సీలు ఇప్పుడు వణుకుతున్నాయి. గడిచిన 24 గంటల్లో న్యూయార్క్‌ స్టేట్‌ జనాభా 2 కోట్లు. న్యూయార్క్‌ స్టేట్‌లో ఒక రోజులో ఏకంగా 1034 మరణాలు సంభవించాయని న్యూయార్క్‌ టైమ్స్‌ రాసింది. న్యూజెర్సీలో వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. మిచిగాన్‌, కాలిఫోర్నియా, లూసియానాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం, సోషల్‌ డిస్టెన్స్‌ని ప్రజలు సరిగ్గా పాటించకపోవడమే ఈ అనర్థాలకు ప్రధాన కారణమని అక్కడి వైద్యులు చెప్తున్నారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైందని, అమెరికా పరిస్థితి ఇటలీ కన్నా ఘోరంగా మారుతోందని అక్కడి పత్రికలు రోజూ రాస్తూనే ఉన్నాయి.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *