June 3, 2023

అదన్నమాట గేదెల శ్రీనుబాబు కథ- జనసేనానీ నీకు హాట్సాఫ్‌

అదన్నమాట గేదెల శ్రీనుబాబు కథ- జనసేనానీ నీకు హాట్సాఫ్‌

గేదెల శ్రీనుబాబు తెలుసు కదా. మామూలుగా అయితే సామాన్యులు గుర్తు పట్టేంత ఫేమ్‌ ఏమీ లేదు. ఇప్పుడైనా గుర్తు పట్టాలంటే కేరాఫ్‌ అడ్రస్‌ జనసేన అఫీస్‌ అని, ల్యాండ్‌ మార్క్‌ పవన్ కల్యాణ్ అని చెప్తే ఓ అతనా అని గుర్తొస్తుంది. మొదట జనసేన ఫస్ట్‌ లిస్ట్‌లో విశాఖపట్నం ఎంపీ సీటు కేటాయించారు. ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తేజగన్ గూటికి చేరారు. ఇదెక్కడ గోలరా బాబు ఇతను నా దగ్గరకు ఎందుకొచ్చాడని జగన్‌ అనుకున్నాడో ఏమో కండువా అయితే కప్పాడు గానీ, లిస్ట్‌లో పేరు మాత్రం లేదు. వైద్య రంగానికి సంబంధించి ఏవో రీసెర్చులు అవీ చేసి.. వేల కోట్లు సంపాదించాడని, శ్రీకాకుళం లాంటి జిల్లానుంచి వచ్చి ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగాడనిచాలా ఛానెళ్లలో ఆయనపై స్టోరీలు వచ్చాయి. వచ్చాయో ఈయనే పెయిడ్‌ న్యూస్‌ వేయించాడో. ఇప్పుడు జనసేనలో ఆయన వ్యవహారం తెలిసాకరెండోదే కరెక్ట్‌ అనిపిస్తోంది. గేదెల శ్రీనుబాబు అనే ఈ సదరు వ్యక్తి తన సంస్థలో ఉన్న ఉద్యోగులకు సరిగ్గా జీతాలే ఇవ్వరట..ఆ ఉద్యోగులే ఈ మధ్య గోల గోల చేశారట. వ్యాపారాల్లో కూడా చాలా అక్రమాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయట. ఇది సోషల్‌ మీడియాలో ఇప్పుడు గిర్రున తిరుగుతున్న వార్తలు. ఈ వార్తలు తిరిగి తిరిగి.. పవన్‌ కల్యాణ్‌ దగ్గరకు వెళ్లాయి. అసరే యమా స్ట్రిక్ట్‌ అయిన పవన్‌కి ఇలాంటివంటే నిజంగానే చిరాకు. ఇప్పుడే ఇలా ఉంటేఎంపీ అయితే ఇంకేమైనా ఉందా..? అయినా కలుపుని ముందే పీకి పారేయాలనకున్నాడో ఏమోసదరు గేదెల శ్రీనుబాబుని మర్యాద పూర్వకంగా పిలిచిమీకు విశాఖ సీటు ఇవ్వడం కుదరదు.. అని చెప్పేశారట. ఇక చేసేది లేని శ్రీనుబాబు తన కాస్ట్‌లీ కార్లో అటునుంచి అటే లోటస్‌పాండ్‌కి వెళ్లి జగన్‌ గూటికి చేరారు. మొత్తానికి నిజానిజాలు ఎలా ఉన్నా.. పవన్‌ రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు. ఆల్రెడీ టికెట్‌ ఇచ్చాక కూడా చిల్లర ఆరోపణలు వస్తే.. ఆ క్యాండిడేట్‌ని ఇంటికి పంపిచడంఅబ్బో గ్రేట్‌. పవన్‌ నీకు హాట్సాఫ్‌. నిజాయతీగా ముందుకెళతాం, మచ్చ లేని నాయకులనే ఎంచుకుంటాం అన్న నీ సిద్ధాంతాన్ని ఇంత స్ట్రిక్ట్‌గా అమలు చేస్తున్నందుకు శెభాష్‌. ఈ జోరు ఇలాగే కొనసాగించు. విజయీభవ.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *