June 7, 2023

అమెజాన్‌ ప్రైమ్‌లో సాహో రిలీజహో…

అమెజాన్‌ ప్రైమ్‌లో సాహో రిలీజహో…

సాహోరిజల్ట్‌ ఎలా ఉన్నా ఆ మూవీ ఓ సంచలనమే. ఓ ఏడాది పాటు ఆ మూవీపైనే అందరి కళ్లు. బాహుబలి ఇమేజ్‌తో ప్రభాస్‌ సాహోతెలుగు రాష్ట్రాల్లో కన్నా బాలీవుడ్‌లోనే ఎక్కువ కలెక్ట్‌ చేసింది.ఇప్పుడా మూవీ.. అమెజాన్‌ ప్రైమ్‌లోకి వచ్చేసింది. థియేటర్లలో చూడనివారు, మళ్లీ చూడాలని అనుకునేవారు చూడొచ్చు. ‌అమెజాన్ ధాటికి ఏ సినిమా అయినా నెల, రెండు నెలల్లో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైపోతోంది. జస్ట్‌ నెలకు 200 ఖర్చుతో హై క్వాలిటీ మూవీస్‌, టీవీ షోస్‌ ఇస్తోంది అమెజాన్‌.ఇప్పట్లో ప్రైమ్‌ వీడియోకి పోటీ ఏదీ లోకల్‌ మార్కెట్‌లో కనిపించడం లేదు. నెట్‌ఫ్లిక్స్‌ హై క్వాలిటీ అవుట్‌పుట్‌ అయినా రేట్‌ మిడిల్‌క్లాస్‌కి అందుబాటులో లేదు. పైగా అందులో తెలుగు సినిమాలు తక్కువ. ఇప్పుడిప్పుడే అందులో తెలుగు మూవీస్‌ కనిపిస్తున్నాయి. సన్‌ NXT, జీ5, సోనీ లివ్‌ లాంటివి ఉన్నా.. అమెజాన్‌ అంత దూకుడు మీద లేవు. లేటెస్ట్‌ మూవీస్‌ కావాలంటే ప్రైమ్‌ వీడియోనే దిక్కవుతోంది. పైగా థియేటర్లో ఒక్క టికెట్‌ రేట్‌కి ఇంట్లో హాయిగా హోమ్‌ థియేటర్లో అందరూ చూసేయొచ్చు. థియేటర్లలో టికెట్‌ ఖర్చు కన్నా ఇంట్రవెల్లో స్నాక్స్‌ అయ్యే ఖర్చు 10 వంతులు ఎక్కువగా ఉంటోంది. ఈ జేబు గుల్ల కన్నా ఓ వారం పది రోజులు ఆగితే ఆన్‌లైన్‌లో మూవీ చూసుకోవచ్చు అనే ఆలోచనే ఆడియన్స్‌లో పెరుగుతోంది. ఈ లెక్కనమరో రెండేళ్లలో మల్టిప్లెక్స్‌లకు తిప్పలు తప్పేలా లేవు.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *