June 7, 2023

ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకారం గెస్ట్‌ లిస్ట్‌లో వీళ్లే స్పెషల్‌ అట్రాక్షన్‌…

ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకారం గెస్ట్‌ లిస్ట్‌లో వీళ్లే స్పెషల్‌ అట్రాక్షన్‌…

రాజకీయంగా ఎలాంటి వ్యూహాలున్నా పాకిస్థాన్ కొత్త అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ అద్భుత ఆటగాడు. క్రికెట్‌ అంటే అతనికి ప్రాణం, పిచ్చి కూడా. క్రికెట్‌ అంటే వెంటనే గుర్తొచ్చే ఆటగాళ్లలో ఇమ్రాన్‌ కూడా ఉంటాడు. 1992లో పాకిస్థాన్‌ వరల్డ్‌ కప్‌ గెలిచిందంటేకారణం ఓన్లీ ఇమ్రాన్‌ ఖాన్‌ స్ట్రాటజీ. అందుకే ఆ పాత రోజులు గుర్తొచ్చాయో ఏమో.. ఆగస్ట్‌ 11న జరిగే ఆయన ప్రమాణ స్వీకారానికి అలనాటి క్రికెట్‌ దిగ్గజాలను ఆహ్వానిస్తున్నారు. ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే ఎంతటి ఉత్కంఠో. అప్పట్లో కపిల్‌ దేవ్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యాల్లో ఇండియాపాక్‌ మ్యాచ్‌ అంటే మినీ యుద్ధమే. ఆట ఆటే, స్నేహం స్నేహమే. అందుకే పాకిస్థాన్‌ అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి కపిల్‌ దేవ్‌, సునీల్‌ గవాస్కర్‌, నవజోత్‌ సింగ్‌ సిద్ధూలనుఇమ్రాన్‌ ఆహ్వానిస్తున్నారు. వీరితో పాటు అమీర్‌ ఖాన్‌ని కూడా ఇన్వైట్‌ చేశారు. ఎందుకంటే లగాన్‌ సినిమాలో క్రికెట్‌ నేపథ్యం ఉంది కదా. గెస్ట్‌ లిస్ట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌ వీళ్లే.అప్పుడంటే ఆట.. ఇప్పుడంతా రాజకీయం. ఇది దేశాలకు సంబంధించిన వ్యవహారం. మరి వీళ్లంతా వెళ్తారా లేదా అన్నదే సస్పెన్స్‌.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *