వారంతా మహారాష్ట్రలోని కొంకణ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన సిబ్బంది. వీరిలో చాలా మంది యువకులే. సరదాగా పిక్‌నిక్ కోసం మహాబలిపురం బయలుదేరారు. బయలు దేరే ముందు అందరూ సరదాగా ఫోటోలు దిగారు. సాతారా జిల్లా అంబేనరి ఘాట్‌కి వచ్చేవరకు ప్రయాణం సాఫీగానే సాగుతోంది. ఉన్నట్టుంది ఏమైందో పక్కనే ఉన్న లోయలో బస్సు పడిపోయింది. ఇది ముందే గమనించిన ఓ వ్యక్తి బస్సు నుంచి దూకేశాడు. మిగిలిన వారికి మాత్రం ఆ ఛాన్స్ దొరకలేదు. ఏమవుతోందో తెలిసేలోపే 800 అడుగుల లోతున్న ఆ లోయలో పడి బస్సు నుజ్జు నుజ్జు అయింది. బస్సులో 35 మంది ఉన్నారు. వారిలో 32 మంది మరణించారు. మిగిలిన ఇద్దరూ కొన ఊపిరితో ఉన్నారు. మరణాన్ని తప్పించుకున్న ఆ వ్యక్తి అప్పటికే షాక్‌లో ఉన్నాడు. ఆ షాక్‌లోనే అక్కడి స్థానికులకు విషయం చెప్తే వారే పోలీసులను పిలిచారు. వెంటనే చర్యలు చేపట్టారు.. కానీ లోయ బాగా లోతుగా ఉండడం వల్ల మృత దేహాలను వెలికితీయడం కష్టంగా మారింది. విహార యాత్రకు వెళ్లి విగత జీవులుగా మారిన ఈ ఘటన కంటతడి పెట్టిస్తోంది.
Related Posts
వాట్సాప్ పేమెంట్ సర్వీస్… సురక్షితమేనా ?
ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం
July 1, 2018
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్
July 1, 2018
ఆగస్ట్ 27లోగా రాకపోతే… విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే
ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా వేరే
July 1, 2018
వాహ్ క్యా ట్రైలర్ హై! దుల్కర్ అదరగొట్టాడు…
దుల్కర్ సల్మాన్… మన తెలుగులో ఓకే బంగారం సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటికే
July 1, 2018
విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి
ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో
July 3, 2018