June 3, 2023

చరణ్‌, బోయపాటి హై ఓల్టేజ్‌ యాక్షన్‌

చరణ్‌, బోయపాటి  హై ఓల్టేజ్‌ యాక్షన్‌

బోయపాటి శ్రీను హీరోలను ఎలా చూపిస్తాడో తెలిసిందే. అసలు హీరోయిజాన్ని చూపించాలో.. మాస్‌తో విజిల్స్‌ ఎలా కొట్టించాలో తెలిసిన దిట్ట బోయపాటి. భద్రతో మొదలుపెడితేజయ జానకీ నాయక వరకు.. ఎలాంటి హీరోకైనా మాస్‌ అప్పీల్‌ తేవడంలో బోయపాటి స్కిల్స్‌ సూపర్‌. రంగస్థలంతో మాసివ్‌ హిట్‌ సొంతం చేసుకున్న రామ్‌ చరణ్‌బోయపాటి దర్శకత్వంలో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బోయపాటిచరణ్‌ని ఎలా ప్రెజెంట్‌ చేస్తాడో మరి. ఇందులో కూడా ఫ్యాన్స్‌ చేత విజిల్స్‌ కొట్టించే అద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉన్నాయని యూనిట్‌ వర్గాల సమాచారం. హైదరాబాద్‌లో కొన్ని స్పాట్లలో, రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఇప్పటికేహై వోల్టేజ్‌ ఫైట్‌ సీన్స్‌ షూటింగ్‌ జరుగుతోంది. తమిళ పాపులర్‌ ఫైట్‌ మాస్టర్‌ కణల్‌ కణ్నన్‌.. రామ్‌, బోయపాటి సినిమాకు స్టన్నింగ్‌ స్టంట్స్‌ అందిస్తున్నారట. వచ్చే ఆగస్ట్‌లో ఫస్ట్‌ లుక్‌ వచ్చే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో చాలా గ్యాప్‌ తర్వాత ఈవీవీ కుమారుడు ఆర్యన్‌ రాజేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *