June 7, 2023

చిరు@152 టైమింగ్‌ కామెడీ యాక్షన్‌ థ్రిల్లర్‌ ? అయితే మెగాస్టార్‌ ఆన్‌ హ్యాట్రిక్‌

చిరు@152 టైమింగ్‌ కామెడీ యాక్షన్‌ థ్రిల్లర్‌ ? అయితే మెగాస్టార్‌ ఆన్‌ హ్యాట్రిక్‌

చిరు రీ ఎంట్రీ ఖైదీ నంబర్‌ 150. రైతుల సమస్యలు, కార్పొరేట్ల ఆగడాలపై ఓ ఖైదీ చేసిన యుద్ధంసామాజిక అంశం. 151వ సినిమా తొలి తెలుగు స్వంతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందించిన సైరా. రెండూ సీరియస్‌ సినిమాలే. కానీచిరు స్పెషల్‌ టైమింగ్ కామెడి. చిరులా టైమింగ్‌ కామెడి చేయగల హీరో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఏ టాప్‌ హీరోకి ఇది సాధ్యం కాలేదు. అభిలాష, చంటబ్బాయి సినిమాల్లో స్టోరీ సీరియస్సే. కానీ కేవలం చిరు కామెడి టైమింగ్‌ వల్ల ఆ సినిమాలు క్లాసిక్స్‌ అయ్యాయి. ఆ తర్వాత కూడా ప్రతీ సినిమాలో చిరు కామెడి టచ్‌ ఆయన ఇమేజ్‌ని అమాంతం పెంచేసింది. శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ అయితే పీక్స్‌. మరి ఇప్పుడు మళ్లీ చిరు అలాంటి టైమింగ్‌ కామెడీతో మళ్లీ అభిమానులకు సూపర్‌ కిక్‌ ఇవ్వబోతున్నారా? 152వ సినిమా స్టైలిష్‌ హీరో విత్‌ టైమింగ్‌ కామెడితో చూపించబోతున్నారా? లేటెస్ట్‌గా రామ్‌చరణ్‌, కొరటాల షేర్‌ చేసిన ఫోటో చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. చార్లి చాప్లిన్ ముందు చరణ్‌, కొరటాల దిగిన ఓ ఫోటోను షేర్‌ చేశారు. చిరుతో మూవీ ఫైనలైజ్‌ అయ్యాక ఇలాంటి ఫోటో రిలీజ్‌ చేయడం వెనుక ఏదో కథ ఉందనే అభిమానులు అనుకుంటున్నారు. నిజంగా అదే కథ అయితేచిరు ఖాతాలో మరో మెగా హిట్‌ని ఇప్పుడే వేసేయొచ్చు. ఎందుకు చిరంజీవి మనసు పెట్టి కామెడి చేసిన ప్రతీ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌. మరి చిరు లేటెస్ట్‌ మూవీ ఆయనకు అచ్చొచ్చిన కామెడీ ఓరియెంటెడ్‌ యాక్షన్‌ థ్రిల్లరాఅభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్నది ఇదే.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *