June 7, 2023

సోనీలివ్‌ ఓటీటీలో వచ్చిన రాకెట్‌ బాయ్స్‌ సూపర్‌ హిట్‌తో దూసుకుపోతోంది. అభయ్‌ పన్ను దర్శకత్వంలో వచ్చిన ఈ సీరిస్‌ ఖచ్చితంగా పిల్లలకు చూపించాల్సిన వెబ్‌సిరీస్‌ ఇది. మన అణు పరిశోధనల నుంచి ఇస్రో వరకు మన దేశ న్యూక్లియల్‌ హిస్టరీ తెలుసుకోవాలంటే ఈ సీరీస్ బెస్ట్ ఆప్షన్‌. స్వతంత్రానికి ముందు, తర్వాత మన దేశంలో పరిస్థితులతో పాటు, మన సైంటిస్ట్‌ల కష్టాలను కళ్లకు కట్టేలా తీశారు. అబ్దుల్‌ కలామ్‌ గురించి దేశమంతా తెలుసు. కానీ ఆయన.. తన గురువులుగా భావించే హోమీ భాభా, విక్రమ్‌ సారాభాయ్‌ల గురించి చాలా మందికి తెలిసింది తక్కువే. హోమీ భాభానే లేకపోతే మన దేశంలో న్యూక్లియర్‌ టెక్నాలజీనే లేదు. విక్రమ్‌ సారాభాయ్‌ లేకపోతే ఇస్రో లేదు. వీరిద్దరి వల్లే మన దేశం ఈ రోజున న్యూక్లియర్‌, స్పేస్‌ టెక్నాలజీలో ప్రపంచం ముందు తల ఎత్తుకుని నిలబడింది.

అసలు హోమీ భాభా ఎవరు? విక్రమ సారాభాయితో అతని పరిచయం ఏంటి?విక్రమ్‌ సారాభాయికి అబ్దుల్‌ కలామ్‌ ఎలా పరిచయమయ్యారు? ఇవన్నీ అత్యద్భుతంగా చిత్రీకరించారు. వారి వ్యక్తిగత జీవితాలను కూడా చాలా చక్కగా చూపించారు. అప్పటి వరకు సంప్రదాయ పరిశ్రమలే ఉన్న మన దేశానికి యంత్రాలు అవసరమని విక్రమ్ సారాభాయ్‌ చేసిన పోరాటం గురించి తెలిసింది చాలా తక్కువ మందికే. హోమీ భాభా లైఫ్‌ అంతా రిస్కే. అప్పటికి అమెరికా మరో రెండు దేశాలు న్యూక్లియర్‌ బాంబులు తయారు చేశాయి. అమెరికా అప్పటికే హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేసింది. అక్కడి

నుంచి కథ మొదలవుతుంది. హోమీ భాభా న్యూక్లియర్‌ పరిశోధనలు చేయడం, స్వతంత్రం రావడం, చైనావార్‌, ఓటమి, ఆ సమయంలో మనకో బాంబ్‌ కావాలని నెహ్రూని ఒప్పించడం, హోమీ భాభాపై సీఐఏ కుట్రలు… ఒక్కటి కాదు చాలా ఉత్కంఠ కలిగిస్తాయి. హోమీ భాభా దేశానికి చేసిన ఆ సేవ అద్భుతం. ఆ తర్వాత ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ సెంటర్ ఏర్పాటు కావడం. విక్రమ్‌, అబ్దుల్‌ కలాం రాకెట్ లాంఛింగ్‌, ఆనాటి కష్టాలు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సీరీస్‌ ప్రధమ భాగం మాత్రమే. మరో సీజన్‌ ఉంది. సోనీ లివ్‌ స్కామ్‌ తర్వాత ఆ స్థాయిలో హిట్‌ అయిన వెబ్‌ సిరీస్‌ ఇది. IMDB…9కి పైగా రేటింగ్‌ ఇచ్చింది.

హోమీ భాభాగా నటించిన జిమ్‌ సార్భ్‌, విక్రమ్‌ సారాభాయ్‌గా ఇష్వాక్‌ సింగ్‌, అబ్దుల్‌ కలాంగా అర్జున్‌ రాధాకృష్ణన్ అద్భుతమైన నటన చేశారు. ముఖ్యంగా కలాం చిన్ననాటి సన్నివేశాలను కూడా చాలా అందంగా చూపించారు. విక్రమ్‌ సారాభాయ్ భార్య మృణాళినిగా రెజీనా నటించారు.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *