May 30, 2023

ప్యాన్‌ ఇండియా మూవీస్‌. సౌత్‌ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌ని షేక్‌ చేస్తోంది.సౌత్‌ నుంచి పెద్ద హీరోల సినిమాలు వస్తే బాలీవుడ్‌ కింగ్‌కాంగ్‌లు కూడా కంగారు పడాల్సిన పరిస్థితి. మన సినిమాలు ఆ రేంజ్‌లో ఉంటున్నాయి. ఇప్పుడు కూడా ఇండియన్‌ మల్టిప్లెక్స్‌ దృష్టి…. మన సౌత్‌ సినిమాల మీదే ఉంది. ఆ సినిమాలేంటో చూద్దాం.

ప్యాన్‌ ఇండియా సినిమాల్లో హాట్‌ టాపిక్‌ RRR. జక్కన్న చెక్కుతున్న ఈ సెల్యులాయిడ్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఎన్‌టీఆర్‌, రామ్‌చరణ్‌ కాంబోతో ఈ సినిమా అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. 400 కోట్లకు పైనే బడ్జెట్‌. బాలీవుడ్‌, హాలీవుడ్ స్టార్లు. ఈ రేంజ్‌లో వస్తున్న RRR సినిమాపై భారీ అంచనాలున్నాయి. స్వతంత్ర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల లైఫ్‌ స్టోరీకి, ఫిక్షన్‌ జోడించి రాజమౌళీ చేస్తున్న మ్యాజిక్‌ ఏంటో స్క్రీన్ మీద చూడాలి. ఇప్పటికే ఇద్దరి హీరోల ట్రైలర్లు రచ్చ రచ్చ చేస్తున్నాయి.

బాహుబలితో ప్రభాస్‌ బాలీవుడ్‌ స్టార్లను కూడా దాటేశాడు. ప్రభాస్‌ సినిమా వస్తే అక్కడి స్టార్లు కూడా రిలీజ్‌ డేట్లు మార్చుకోవాల్సిన పరిస్థితి. సాహో సినిమాకి సౌత్‌లో ఆశించిన ఫలితం రాకపోయినా… బాలీవుడ్‌లో మాత్రం సూపర్‌ హిట్‌ అయింది. ప్రభాస్‌ క్రేజ్‌తో ఆ సినిమా ఆడింది. ఇప్పుడు వింటేజ్‌ లవ్‌స్టోరీతో ప్రభాస్‌ రాధేశ్యామ్‌గా దేశవ్యాప్తంగా సందడి చేయబోతున్నాడు. రీసెంట్‌గా వచ్చిన ఫస్ట్‌లుక్‌కే రికార్డు స్థాయిలో వ్యూస్‌ వచ్చాయి. ఇప్పటికే రామాయణం కథతో ఆదిపురుష్‌ సినిమా ప్రకటించి ప్రభాస్‌ పెద్ద షాకే ఇచ్చాడు. రాధే శ్యామ్‌ తర్వాత ఆ సినిమా కూడా లైన్లో ఉంది. ఈ లెక్కన ఆలిండియా స్టార్‌ కుర్చీ కోసం ప్రభాస్‌ మాంచి స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాడు. రాధే శ్యామ్… ఇండియా వైడ్‌గా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

టాలీవుడ్‌లో స్టైలిష్‌ స్టార్‌ అల్లూ అర్జున్‌ రేంజ్‌ ఏంటో అందరికీ తెలుసు. సౌత్‌లో బన్నీకి మాంచి క్రేజ్‌ ఉంది. అర్జున్‌… ఈ సారి ప్యాన్‌ ఇండియాపై దృష్టి పెట్టాడు. ఆ సినిమా పుష్ప. పుష్ప సినిమా టేకింగ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ఒక్క పోస్టర్‌తో చెప్పేశాడు దర్శకుడు సుకుమార్‌. రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన సుకుమార్‌, అలవైకుంఠ పురం ఇండస్ట్రీ హిట్‌తో మాంచి జోరు మీదున్న అల్లూ అర్జున్‌ల కాంబో.. ఎర్ర చందనం స్మగ్లర్ల కథ.. ఇంతకన్నా మాస్‌ ఎలిమెంట్స్‌ ఇంకేం కావాలి? ఈ సారి ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేసిన పుష్ప.. సంచలనం సృష్టించడం ఖాయం.

అర్జున్‌ రెడ్డి… ఈ మూవీ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ దేశమంతా పాకింది. ఎంతలా అంటే.. ఇక్కడ ఫ్లాప్‌ అయిన విజయ్‌ సినిమాల హిందీ డబ్బింగ్‌లకు నార్త్‌లో మాంచి డిమాండ్‌ ఉంది. యూట్యూబ్‌లలో ఆ సినిమాలు రికార్డ్‌ వ్యూస్‌తో దూసుకెళ్తున్నాయి. అందుకే విజయ్‌ కూడా ప్యాన్‌ ఇండియా స్టోరీలపైనే దృష్టి పెట్టాడు. ఇప్పుడు పూరి జగన్నాథ్‌, విజయ్‌ కాంబోలో వస్తున్న ఫైటర్‌ సినిమా ఆల్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ అవుతోంది. ఇప్పటికే మాంచి క్రేజ్‌ మీద ఉన్న విజయ్.. ఇండియా వైడ్‌ హిట్‌ కోసం బాగానే కష్టపడుతున్నాడు.

ఇవన్నీ ఒక రేంజ్‌ అయితే… మరో సినిమా కోసం ఇండియా అంతా ఎదురు చూస్తోంది. ఆ సినిమా KGF చాప్టర్‌ 2. ఒక కన్నడ సినిమా… దేశ వ్యాప్తంగా ఇంత సంచలనం సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు. కేజీఎఫ్‌తో యష్‌ పేరు దేశమంతా మారుమోగింది. కేజీఎఫ్‌ తర్వాత యష్‌ రేంజే మారిపోయింది. ఇప్పుడు KGF చాప్టర్‌ 2లో బాలివుడ్‌ స్టార్లు నటిస్తున్నారంటే ఆ సినిమా ఏ రేంజ్‌లో హిట్టయిందో చెప్పొచ్చు. కనీసం ట్రైలర్‌ అయినా రిలీజ్‌ చేయండని ఫ్యాన్స్‌ ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్‌లతో రచ్చ చేస్తున్నారు.

KGF చాప్టర్‌ 2 కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. ఫస్ట్ పార్ట్‌లో షాకింగ్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కోసం పెద్ద హీరోలు పోటీ పడుతున్నారు. అంతా బాగుంటే అక్టోబర్‌ 23న రిలీజ్‌ కావాలి. కొవిడ్‌ వల్ల వాయిదా పడింది. ఎప్పుడు రిలీజ్‌ అయినా KGF చాప్టర్‌ 2 ఏ సినిమాకైనా గట్టి పోటీనే.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *