ఇది ఇప్పటికి కాదు 30 ఏళ్లుగా నలుగుతున్న వివాదం. రెండు దేశాలూ ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకున్నారు. విష ప్రయోగాలు జరిగాయి. అవన్నీ దాటి ఇప్పుడు యుద్ధం వరకు వచ్చాయి. ప్రపంచంలో చాలా దేశాలకు అమెరికా పెత్తనం నచ్చదు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి కూడా ఇది నచ్చలేదు. యుద్ధానికి ప్రధాన కారణం ఇదే. అసలు కథలోకి వెళ్లాలంటే చాలా ఏళ్ల ముందుకు వెళ్లాలి. ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్ వార్‌లో మనకు పుతిన్ ప్రధానంగా కనిపిస్తున్నా, సైలెంట్ గేమ్ ఆడుతున్న మరో వ్యక్తి కూడా ఉన్నాడు. అతనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదమిర్ జేలేనస్కి. ఇతను ఓ యూదు జాతీయుడు. పుతిన్ నియో నాజీ అని అనేది ఇతన్ని ఉద్దేశించే. ఒకప్పుడు ఉక్రెయిన్ సోవియట్ యూనియన్‌లో భాగం. సోవియట్ విడిపోక ముందు ఆ దేశానికి రాజధాని కూడా. 1990ల్లో సోవియట్ యూనియన్ విడిపోయాక ఉక్రెయిన్ స్వతంత్ర దేశం అయింది. అమెరికా – రష్యా కోల్డ్ వార్ గురించి తెలిసిందే. అది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. అందుకే రష్యాకి కౌంటర్ ఇచ్చే అవకాశం కోసం చూస్తున్న అమెరికాకు ఉక్రెయిన్ దొరికింది. అమెరికాతో పాటు యూకే, బెల్జియం, కెనడా లాంటి దేశాల కూటమి నాటో. ఈ దేశాలన్నీ ఉక్రెయిన్‌లో నెమ్మదిగా పెట్టుబడులు పెట్టడం, మెల్లగా అక్కడ ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకోవడం మొదలుపెట్టాయి. ఉక్రెయిన్ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్‌కి తరగని గని. 1994 నుంచి అమెరికా సహా నాటో దేశాలు ఉక్రెయిన్‌లో ఆయిల్, నేచురల్ గ్యాస్ ఇండస్ట్రీల మీద మాత్రమే పెట్టుబడులు పెడుతూ వచ్చాయి. ఇంతా చేసి అమెరికా సహకారంతోఉక్రెయిన్ ఏమైనా ఆర్థికంగా ఎదిగిందా అంటే.. ఈ 30 ఏళ్లలో చెప్పుకోదగ్గ అభివృద్ధే లేదు. ఇదిగో ఇలాంటి సమయాల్లో మాత్రమే ఆ దేశం పేరు వినిపిస్తూ ఉంటుంది. ఉక్రెయిన్ అభివృద్ధి విషయంలో ఏదో రోజు పేచీ ఉంటుందని అమెరికాకూ తెలుసు. అందుకే నాటో దేశాల లిస్ట్‌లో ఉక్రెయిన్‌ని చేరుస్తామని యూఎస్ చెబుతూ వచ్చింది. ఉక్రెయిన్ నాటోలో చేరితే.. ఉక్రెయిన్ మీద ఆమెరికా పట్టు పెరుగుతుంది. సరిహద్దుల్లో నాటో సైన్యాలు తిష్ట వేస్తే అది రష్యాకు ప్రమాదం. ఉక్రెయిన్, జార్జియాలు… రష్యాకు కీలకమైన సరిహద్దు దేశాలు. ఒకవేళ ఈ యుద్ధం సమయానికే ఉక్రెయిన్, నాటోలో ఉందనుకోండి.. రష్యా ఏమీ చేయలేదు. అదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మొదటి భయం.
ఇక రెండోది… ఈ మధ్య వార్తల్లో పుతిన్‌కి-అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కి మాటల యుద్ధాలు జరిగాయి. అందరూ చూసే ఉంటారు. యుద్ధం అంటూ వస్తే రియాక్షన్ తీవ్రంగా ఉంటుందని బైడెన్… పుతిన్‌ని హెచ్చరిస్తున్నాడు కూడా. ఉక్రెయిన్‌కి బైడెన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో తెలుసా? ఉక్రెయిన్‌లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తి చేసే అతి పెద్ద సంస్థల్లో ఒకటి బురిస్మా హోల్డింగ్స్. ఈ సంస్థను ఉక్రెయిన్‌లో మంత్రిగా పనిచేసిన జ్లోచేవ్ స్కీ స్థాపించాడు. 2104లో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పెట్రో పోరోషెంకో ప్రమాణం చేశాడు. ఇతను అమెరికా, నాటో దేశాలకు అనుకూలంగా ఉన్నాడు. తమ దేశంలో అవినీతిని రూపుమాపేందుకు మీ సహాయం కావాలీ అని… అప్పటి రష్యా అధ్యక్షుడు పోరోషెంకో… అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ఒబామాని కోరాడు. అప్పట్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్‌జో బిడెన్. అంటే ఇప్పటి ప్రెసిడెంట్. ఉక్రెయిన్‌లో పరిస్థితి చూడమని ఒబామా… జో బిడెన్‌కి చెప్పాడు. అప్పుడు మొదలైంది అసలు కథ.
ఉక్రెయిన్‌లో నేచురల్ గ్యాస్ ఉత్పతి చేసే అతి పెద్ద సంస్థ బురిస్మా హోల్డింగ్స్ అని చెప్పుకున్నాం కదా. అందులో అందులో జో బిడెన్ కుమారుడు హంటర్ బిడెన్‌ను డైరెక్టర్‌గా అపాయింట్ అయ్యాడు. ఇదంతా ఓ ప్లానింగ్ ప్రకారమే జరిగిందని ఎవరికైనా అర్థమైపోతుంది. ఇక అమెరికా వైస్ ప్రెసిడెంట్ కొడుకంటే మాటలా. ఉక్రెయిన్‌లో మరో అమెరికన్ పవర్ సెంటర్ ఉన్నట్టే. బిడెన్ కుమారుడి హవా ఉక్రెయిన్‌లో నడిచింది. 2014 నుంచి 19 వరకు ఇది నడిచింది. రీసెంట్ అమెరికన్ ఎలక్షన్స్ టైమ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి ప్రెసిడెంట్ ట్రంప్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. తండ్రి గెలుపు మీద ఇది ప్రభావం చూపిస్తుందని బురిస్మా హోల్డింగ్స్ నుంచి హంటర్ బిడెన్ బయటకు వచ్చేశాడు. ఇవే కాకుండా హంటర్ బిడెన్ బినామీ పెట్టుబడులు చాలానే ఉన్నాయని అప్పటి ఎన్నికల్లో చాలా విమర్శలు వచ్చాయి. ఈ పెట్టుబడుల్లో కొన్నిచైనాలో కూడా ఉన్నాయి. అసలే అమెరికా పెత్తనం అంటే నచ్చని రష్యా, చైనాలకు మంచి లింకు దొరికింది. ఇకనేం అమెరికాను ఆడుకోవడం మొదలుపెట్టారు.
అమెరికా పొలిటికల్ గేమ్ సెంటర్ ఉక్రెయిన్ కదా. అందుకే పుతిన్ అక్కడ గట్టిగా బిగించడం మొదలు పెట్టాడు. అలా బిగిస్తే… హంటర్ బిడెన్ పెట్టుబడులు వదిలేయడం తప్ప ఇంకేం చేయలేడు. ఒక్క హంటర్ బిడెనే కాదు అతన్ని నమ్ముకుని పెట్టిన నాటో దేశాలూ పెట్టుబడులు వదిలేసుకోవాల్సిందే.లేదంటే ఈ వ్యవహారం అమెరికన్ ప్రెసిడెంట్‌కి మచ్చ. అందుకే అమెరికా పెత్తనానికి చెక్ పెట్టే సమయం సరిగ్గా చిక్కిందని పుతిన్ యుద్ధం అన్నాడు. కానీ ఇందులో అసలైన సినిమా చూస్తున్నది మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడే. పుతిన్ వల్ల బిడెన్, నాటో కంట్రీస్ అన్నీ పెట్టుబడులు వదులుకోవాలి. అలా వదులుకుంటే ఉక్రెయిన్‌కే లాభం. ఇదొక కోణం. అందుకే అటు అమెరికాకు ఫ్రెండ్‌లా ఉంటూనే… పుతిన్ దూకుడుని సైలెంట్‌గా గమనిస్తున్నాడు. అయితే పుతిన్ సామాన్యుడు కాదు.. యుద్ధం బెదిరింపు కాదు నిజమేనని కదం తొక్కేశాడు. మరి ఇప్పుడు ఉక్రెయిన్ స్ట్రాటజీ ఏంటో చూడాలి. అటు జో బిడెన్ రష్యా నిర్ణయాలను వ్యతిరేకించలేక, ఉక్రెయిన్‌ని సమర్థించలేక నానా తంటాలు పడుతున్నాడు. అమెరికా పరిస్థితే ఇలా ఉంటే ఇక నాటో దేశాలు ఏం చేయగలవు? ఇక ఇక్కడ మొత్తం గేమ్ అంతా పుతిన్ చేతిలోకి వచ్చేసింది. అందుకే అతను అంత దూకుడుగా వెళ్ళగలుగుతున్నాడు. ఇది రష్యా-ఉక్రెయిన్ వార్ ఫ్లాష్‌బ్యాక్.