ఆయ్.. మా ప్రభాస్ ప్రభాసే. ఇంకెవరితో పోలికలొద్దు అంటారా? ఫర్వాలేదు డార్లింగ్ పొల్చచ్చు. ఎందుకంటే హాలివుడ్‌లో టామ్‌క్రూజ్ చేసినన్ని రిస్క్స్ ఎవరూ చేసి ఉండరు. షాట్ బాగా వస్తుందని డైరెక్టర్ చెప్తే… 5000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఏరోప్లేన్ పుట్‌బోర్డ్ మీద నిల్చొని స్మైలిచ్చినవాడు టామ్‌క్రూజ్. మిషన్ ఇంపాజిబిల్ సిరీస్ ఓ అద్భుతం. ఇప్పుడు సాహో ట్రైలర్ చూస్తుంటే… మన టాలివుడ్‌లో కూడా ఓ టామ్ క్రూజ్ ఉన్నాడని అనిపిస్తుంది.వాటే స్టైల్, వాటే యాక్షన్. కేవలం ఒక్క సినిమా చేసిన సుజిత్‌కి ఓకే అన్నాడేంటబ్బా అనిపించింది. ప్రభాస్‌కి ఏమైనా పిచ్చా అనిపించింది కూడా.కానీ, సుజిత్.. అంచనాలు పెంచేశావ్ బాస్. ముంబైలో 2000 కోట్ల రోబరీ జరిగింది.. అని ట్రైలర్ మొదలైంది. కింద ఫ్యాన్స్ చాలామంది ఒక్కటే మాట.. 2000 కోట్లేగా మా సాహో తెచ్చిస్తాడట… !! నిజమై ట్రైలర్ చూస్తే అలానే అనిపిస్తోంది. మరో కామెంట్ బాగుంది. బాలివుడ్‌కి ఎప్పుడొస్తావు అని ఓ రిపోర్టర్ ప్రభాస్ అడిగాడట. బాలివుడ్డే నా దగ్గరికి వస్తుంది అని మనోడూ కూల్‌గా చెప్పాడట. అంతేగా మరి. గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికే క్రేజ్. తెలుగు డార్లింగ్స్ మనం. ఆ మాత్రం బలుపుండాలి.అంత బాలివుడ్ రికార్డులని ఒక్క బాహుబలితో తుక్కు తుక్కు చేసేశాడు. మేం బాలివుడ్ ఎప్పుడో దాటాశాం బాస్. వాళ్లే ఏ సినిమా రీమేక్ చేద్దామా అని టాలివుడ్‌లో బ్రాండెడ్ షూలు అరిగేలా తిరుగుతున్నారు. ఇప్పుడు మన లెవల్ ఇంకా పెరిగింది. ఏమైనా బాహబలి లుక్స్ నుంచి సాహో లుక్స్‌కి మారడం పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ప్రభాస్ డార్లింగ్ సక్సెస్ అయ్యాడు. ఆగస్ట్ 30న సినీ వరల్డ్ దద్దరిల్లిపోతుందా… పోవాలి మరి…కొన్ని సార్లు కటౌట్ చూసి నమ్మేయాలి డ్యూడ్..
Related Posts
వాట్సాప్ పేమెంట్ సర్వీస్… సురక్షితమేనా ?
ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం
July 1, 2018
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్
July 1, 2018
ఆగస్ట్ 27లోగా రాకపోతే… విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే
ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా వేరే
July 1, 2018
వాహ్ క్యా ట్రైలర్ హై! దుల్కర్ అదరగొట్టాడు…
దుల్కర్ సల్మాన్… మన తెలుగులో ఓకే బంగారం సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటికే
July 1, 2018
విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి
ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో
July 3, 2018