June 7, 2023

కామన్‌ మ్యాన్‌కి కాస్త ఊరట…

కామన్‌ మ్యాన్‌కి కాస్త ఊరట…

కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్‌ ఆధ్వర్యంలో దిల్లీలో జరిగిన GST 28వ కౌన్సిల్ సమావేశంలో సామాన్యులకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్నారు. అత్యధిక పన్ను శ్లాబులో ఉన్న కొన్ని వస్తువులను తక్కువ పన్ను శ్లాబులోకి తీసుకొచ్చారు. ఇందులో ముఖ్యంగా శానిటరీ నాఫ్కిన్స్‌పై GST ఎత్తివేయాలని ఏడాదిగా ప్రొటెస్ట్‌లు జరుగుతున్నాయి.ఫలితంగాఈ కౌన్సిల్‌లో శానిటరీ నాఫ్కిన్స్‌పై GST తొలగిస్తున్నట్టు పియూష్‌ గోయల్‌ ప్రకటించారు. ఇప్పటి వరకు శానిటరీ న్యాప్‌కిన్లపై 12శాతం జీఎస్టీని వసూలు చేశారు. 1000 రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న చెప్పులపై పన్ను 5శాతానికి తగ్గించారు. మార్బుల్స్‌, రాతితో తయారు చేసే దేవతల విగ్రహాలపైనా జీఎస్టీ తొలగించారు. ఏసీలు, టీవీలు, వాషింగ్‌ మెషీన్లు, లిథియం ఐయాన్‌ బ్యాటరీలు, వ్యాక్యుమ్‌ క్లీనర్స్‌, ఫుడ్‌ గ్రైండర్లు, మిక్సీలు, వాటర్‌ హీటర్లు, హెడ్‌ డ్రైయర్లు, హ్యాండ్‌ డ్రైయర్లు, పెయింటింగ్స్‌, వార్నిష్‌, వాటర్‌ కూలర్‌, మిల్క్‌ కూలర్‌, ఐస్‌క్రీం కూలర్‌, పెర్ఫ్యూమ్స్‌, టాయిలెట్‌ స్ప్రేలపై మునుపు 28 శాతం పన్నుండేది. ఇప్పటి నుంచి పై వస్తువులన్నీ 18 శాతం పన్ను శ్లాబులోకి వస్తాయి. ఇది మధ్యతరగతి వారికి ఊరట కలిగించే అంశమే. దిగుమతి చేసుకునే యూరియాపై జీఎస్టీ 5శాతం తగ్గించారు. రూ.5కోట్ల టర్నోవర్‌ కలిగి ఉన్న వ్యాపారులు ఇక ప్రతి నెలా జీఎస్టీని చెల్లించాలి. అయితే, 3 నెలలకోసారి రిటర్న్స్‌ దాఖలు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ వివరించారు. తగ్గించిన పన్ను ధరలు జులై 27 నుంచి అమల్లోకి వస్తాయి.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *