June 3, 2023

అమ్మ… ‘శరవణ’ రాజగోపాలా ? దోశా కింగ్‌ కన్నింగ్‌ స్టోరీ

అమ్మ… ‘శరవణ’ రాజగోపాలా ? దోశా కింగ్‌ కన్నింగ్‌ స్టోరీ

తెల్లపంచె కడితే అబ్బో అనుకున్నాం. నుదుటిన ఎప్పుడూ గంధం బొట్టు పెడితే భక్తుడే అనుకుంటాం. దోశలు వేసే చేత్తో మర్డర్లు కూడా చేయిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. ఇది శరవణా భవన్ అధినేత రాజగోపాల్‌ నిజ స్వరూపం. శరవణా భవన్‌. దోశా లవర్స్‌కి పరిచయం అక్కర్లేని పేరు. ఇండియన్‌ రెస్టారెంట్స్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ చెయిన్‌ శరవణా భవన్‌. లండన్‌, న్యూయార్క్‌, సింగపూర్‌, సిడ్నీ ఇలా చాలా దేశాల్లో శరవణా భవన్ విస్తరించింది. దోశా కింగ్‌గా రాజగోపాల్‌కి పేరు. అలాంటి వ్యక్తి ఓ జ్యోతీష్యుడు చెప్పాడని దురాశకు ఆశపడి 71 ఏళ్ల రాజగోపాల్‌ ఇప్పుడు కటకటాలు లెక్కపెట్టబోతున్నాడు. అంటే డబ్బు ఎక్కువైతే అదో జబ్బు. ఇంకా ఏదో కావాలని కోరిక. ఆశ క్యాన్సర్‌ లాంటింది. అత్యాశ ఎయిడ్స్‌ కన్నా ప్రమాదకరమైన వ్యాధి. పల్లె పల్లె తిరిగి ఉల్లిపాయలు అమ్ముకునే కుటుంబం నుంచి వచ్చాడు రాజగోపాల్‌. 1981లో పొట్ట చేత పట్టుకుని చెన్నై వచ్చాడు. అప్పట్లో రెస్టారెంట్లలో తినేది తక్కువే. అయినా రిస్క్‌ చేసి టేస్టీ టేస్టీ ఫుడ్‌తో శరవణా భవన్‌ ప్రారంభించాడు. లక్కుంటే లక్ష్మీ దేవి గుమ్మంలోకి అడుగు పెడుతుంది. అలా రాజగోపాల్‌ దశ తిరిగింది. అప్పుడే విస్తరిస్తున్న రెస్టారెంట్‌ బిజినెస్‌ రాజగోపాల్‌కి కలిసొచ్చింది. శరవణా భవన్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. విదేశాల్లోనూ శరవణా భవన్ టిఫిన్స్‌కి మాంచి క్రేజ్‌. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్‌, గల్ఫ్‌ దేశాల్లో 80 వరకు బ్రాంచ్‌లు ఉన్నాయి. కానీరాజగోపాల్‌లో ఉన్న బలహీనతే అతని అదృష్టాన్ని కరిగించేసింది. తన దగ్గర పనిచేసే ఓ ఉద్యోగి కుమార్తెను పెళ్లిచేసుకుంటే కలిసొస్తుందని ఎవడో జ్యోతిష్యుడు చెప్పాడట. అంత శరవణా రాజగోపాల్‌ విచక్షణ మరిచిపోయి ఆ మాట నమ్మాడు. ఆ మహిళను అడిగాడు. అప్పటికే పెళ్లైన ఆమె ఒప్పుకోలేదు. రాజగోపాల్‌ ఊరుకోలేదు. ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్నాడు. అప్పుడే ఇన్నాళ్ల అనుభవం, విచక్షణ అన్నీ కోల్పోయిన రాజగోపాల్‌.. అమెను వేధించి వేధించి చివరికి ఆమె భర్తను హత్య చేయించాడు. ఇది 2001లో జరిగితే 2004లో కింది కోర్టు ఆయనకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా.. ఇప్పుడా ఆ శిక్ష యావజ్జీవంగా మారింది. ఇదీ ది గ్రేట్‌ దోశా కింగ్‌ కన్నింగ్‌ స్టోరీ. అందుకే భగవంతుడు ఇచ్చిన దాంతో సరిపెట్టుకోవాలి. రాజగోపాల్‌కి భగవంతుడు చాలా ఎక్కువే ఇచ్చాడు. అయితే తృప్తి లేదు. అత్యాశ అనే క్యాన్సర్‌ కాటేస్తే.. ఇలానే ఉన్న పేరు కూడా పోతుంది. 71 ఏళ్ల వయసులో యావజ్జీవం అంటే ఇంక ఆ జీవితం జైల్లో ముగిసిపోయినట్టే. అయినా లేటు వయసులో వయొలెంట్‌గా ఓ హత్య చేయించి, పెళ్లి చేసుకుని.. ఇంకా సాధించాలని రాజగోపాలా… !!!

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *