June 3, 2023

హర్షద్‌ మెహతా. స్టాక్‌ మార్కెట్ తెలిసిన వాళ్లకి, తెలియని వాళ్లకీ కూడా పరిచయం అవసరం లేని పేరు. 1992లో ఆయన చేసిన స్టాక్‌ మార్కెట్‌ స్కామ్‌ దేశాన్ని ఆ రేంజ్‌లో ఊపేసింది. అసలు హర్షద్‌ మెహతా స్కామ్‌ బయటపడకపోయి ఉంటే బ్యాంకింగ్‌ రంగంలో ఉన్న చాలా లొసుగులు ఈ రోజుకీ సామాన్యుడి అర్థమయ్యేవి కావు. అప్పటి వరకు నామ్‌కే వాస్తేగా ఉన్న సెబీకి.. ఈ స్కామ్‌ తర్వాతే పవర్స్‌ వచ్చాయి. స్టాక్‌ మార్కెట్‌లో ఎన్నో మార్పులు జరిగాయి. ఇప్పటికీ స్టాక్‌ మార్కెట్‌లలో ఏం జరుగుతుందో మాక్సిమమ్‌ ప్రజలకు తెలీదు. స్టాక్ మార్కెట్‌ అంటే ఏంటీ, అసలా స్కామ్‌ ఏంటి, హర్షద్‌ మెహతా స్కామ్‌ చుట్టూ ఎవరెవరు ఉన్నారు..? ఇవన్నీ పెద్ద క్వశ్చన్‌ మార్క్‌. 1992 స్టాక్ మార్కెట్‌ స్కామ్‌ కథ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సోనీ లివ్‌ OTTలో వచ్చిన Scam 1992- Harshad Mehta Story చూసి తీరాలి. ప్రజల సెంటిమెంట్‌ పెట్టుబడిగా సాగే మనీ మార్కెట్‌లో ఎన్ని దారుణాలు జరుగుతాయో కళ్లకు కట్టినట్టు చూపించారు. 10 ఎపిసోడ్‌లు ఒక్క క్షణం కూడా బోర్‌ కొట్టవు. హర్షద్‌గా నటించిన ప్రతీక్‌ గాంధీ యాక్షన్‌కి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. అదరగొట్టేశాడు. అప్పట్లో హర్షద్‌ స్కామ్‌ని బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఫైనాన్షియల్‌ రిపోర్టర్‌ సుచేతా దలాల్‌ క్యారెక్టర్‌లో శ్రేయా ధన్వంతరీ సూపర్‌గా చేసింది. వాళ్లు వీళ్లు అని కాదు.. ప్రతీ క్యారెక్టర్‌ ఇరగదీసేశారు. స్టాక్‌ మార్కెట్‌ గురించి ఏ మాత్రం అవగాహన లేనివారికి కూడా చక్కగా అర్థమయ్యేలా తీశారు. 2020లో ఓటీటీలో వచ్చిన ఇండియన్‌ వెబ్‌సిరీస్‌లో ది బెస్ట్‌ Scam 1992 వెబ్‌సీరీస్‌. IMDB ఏకంగా 9.5 రేటింగ్‌ ఇచ్చింది.ఎక్కడా ఒక్క విషయం కూడా వదలకుండా బోల్డ్‌గా తీశారు. ఈ సిరీస్‌ తర్వాత సోనీ లివ్‌ సబ్‌స్క్రైబర్స్ ఒక్కసారిగా పెరిగారు. ఈ సిరీస్‌లో నటించినవారిలో చాలా మంది థియేటర్‌ ఆర్టిస్ట్‌లే. ఈ సిరీస్‌ అనే కాదు చాలా వెబ్‌సీరీస్‌ల్లో నటించిన యాక్టర్లను చూస్తే ఇన్నాళ్లూ ఇంత మంచి నటులంతా ఎక్కడున్నారో అనిపిస్తుంది. హర్షద్‌ మెహతా స్కామ్‌ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ సీరీస్‌ చూడండి. ఎక్కడా అసభ్యత లేకుండా డైరెక్టర్‌ హన్సల్‌ మెహతా, జయా మెహతా చాలా చక్కగా తీశారు. ఇప్పుడు మనం వింటున్న రాకేష్‌ ఝున్‌ఝున్ వాలా, డిమార్డ్‌ అధినేత రాధా కిషన్‌ దమానీ, కేతన్ పరేఖ్‌.. వీళ్ల లైఫ్‌ ఎక్కడి నుంచి స్టార్టైందో తెలుసుకోవాలంటే ఈ సిరీస్‌ చూడాలి. ముఖ్యంగా దలాల్‌ స్ట్రీట్‌ గురించి, స్టాక్‌ మార్కెట్‌ గురించి తెలుసుకోవాలంటే ఈ సిరీస్‌ చూడాల్సిందే.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *