మధ్యప్రదేశ్‌లో ఉన్న అతి పురాతన ఉజ్జయిని పుణ్యక్షేత్రం అనగానే గుర్తొచ్చేది మహా కాళేశ్వరుడు. ఆయనకు పొద్దున్నే చేసే భస్మ హారతి ప్రపంచ ప్రసిద్ధం. మనిషి ఎంత సాధించినా చివరికి బూడిదగా మారక తప్పదని చేప్పే సందేశం ఆ భస్మహారతిలో కనిపిస్తుంది. ఆ భస్మహారతిలోనే మనకు కనిపించని మరో అద్భుతం…. కాలం. మహా కాళేశ్వరుడు.. కాలానికి అధిపతి. కాలానికి మరో అధిపతి మహా కాళి. ఈ ఇద్దరూ కొలువైన క్షేత్రం ఉజ్జయిని. ఆధ్యాత్మిక కోణంలోనే కాదు.. ఉజ్జయిని క్షేత్రం ఒక టైమ్ లాబోరేటరీ. కొన్ని వేల ఏళ్ల క్రితమే భూమి గోళంగా ఉంటుందని, ఆ గోళానికి మధ్య రేఖ ఉంటుదని, ఆ భూమధ్య రేఖ చుట్టూ 180 డిగ్రీల చుట్టూ అక్షాంశాలు, రేఖాంశాలు ఉంటాయని మన శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇవన్నీ వేల ఏళ్ల క్రితమే రచించిన సూర్య సిద్ధాంతం అనే గ్రంధంలో ఉన్నాయి. భూమధ్య రేఖ నుంచి ఉత్తరం వైపు 23న్నర డిగ్రీల రేఖను కర్కట రేఖ అంటారు. అదే 23న్నర డిగ్రీల దక్షిణ రేఖను మకర రేఖ అంటారు. ఇవన్నీ చిన్నప్పుడు సోషల్ పాఠాల్లో చదువుకున్నవే. కానీ అవేంటన్నవి చాలా మందికి తెలియదు. సరిగ్గా ఆ కర్కట రేఖపై సున్నా డిగ్రీల ప్రాంతంలో అంటే కర్కట రేఖ మొదలయ్యే ప్రాంతంలో కట్టిన క్షేత్రమే ఉజ్జయిని.

కర్కట రేఖ మకర రేఖలే ప్రామాణిక కాలాన్ని సూచిస్తాయి. ఈ భూమి మీద మహా కాలానికి చిహ్నం ఉజ్జయిని. ఇండియన్ గ్రీనిచ్‌గా ఉజ్జయినికి పేరు. నిజానికి గ్రీనిచ్ కన్నా ముందు ప్రపంచానికి ప్రైమ్ మెరిడియన్ టైమ్ జోన్ ఉజ్జయిని. ఉజ్జయిని కాలం బట్టే ప్రపంచ కాలాలు నడిచేవి. బ్రిటీష్ సామ్రాజ్యం ఉన్నప్పుడు వారే గ్రీనిచ్‌ని ప్రైమ్ మెరిడియన్‌గా పెట్టారు. ఆ తర్వాత ప్రపంచమంతా అదే ఫాలో అయింది. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాం కూడా. భూమి చుట్టూ ఇప్పుడు మెరిడియన్ లైన్స్‌గా చెప్పుకున్న కాలరేఖలు… కర్కటరేఖ, మకర రేఖ. కర్కట రేఖను ఇంగ్లీష్‌లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. ఆ రేఖ మీద ఉన్న పుణ్యక్షేత్రం ఉజ్జయిని. కొన్ని వేల ఏళ్ల క్రితమే అంత ఖచ్చితంగా భూమి మీద కాలరేఖలను గుర్తించి… సరిగ్గా ఆ రేఖ వెళ్లే ప్రాంతంలోనే మహా కాళేశ్వరుడి ఆలయం కట్టారంటే.. ఈనాటి సైన్స్ కన్నా ఆనాటి సైన్సే అడ్వాన్స్‌డ్. కాలం మీద ఆ కాలంలో ఎలాంటి పరిశోధలను చేశారు? కాలరేఖను ఆ రోజుల్లోనే ఎలా ఊహించారు.

1884లో గ్రీనిచ్ ప్రాంతాన్ని ప్రైమ్ మెరిడియన్‌గా అంటే… ప్రామాణిక కాలంగా గుర్తించారు. లండన్‌లో థేమ్స్ నది ఒడ్డున ఉన్న చిన్న నగరం గ్రీనిచ్. సోషల్ పాఠాల్లో గ్రీనిచ్ మెరిడియన్ గురించి చదివే ఉంటారు. కర్కట రేఖపై సున్నా డిగ్రీ వద్ద గ్రీనిచ్ ఉందని బ్రిటీష్ అంపైర్ ఉన్నప్పుడు డిసైడ్ చేశారు. అందుకే దీన్ని గ్రీనిచ్ రేఖాంశం లేదా.. గ్రీనిచ్ మెరిడియన్ అంటాం. ఇక్కడి సమయాన్ని గ్రీనిచ్ మీన్ టైమ్ అంటే GMT అంటారు. ఈ టైమ్ బట్టే.. ఇండియాలో టైమ్ ఎంత, అమెరికాలో టైమ్ ఎంతన్నది లెక్కిస్తూ ఉంటాం. ఉదాహరణకు లండన్‌లో టైమ్ మధ్యాహ్నం ఒంటి గంట అయిందనుకోండి.. హైదరాబాద్ టైమ్… GMT+ ఫైవ్ థర్టీ అంటే సాయంత్రం ఆరున్నర అయిందన్నమాట. కానీ… గ్రీనిచ్ కన్నా వేల ఏళ్ల ముందే భారతదేశంలో ఈ ప్రైమ్ టైమ్ పాయింట్ ఉజ్జయిని. ఉత్తరం నుంచి దక్షిణం వైపు కర్కట రేఖ వెళ్తుంది. అందుకే ఉజ్జయిని మహా కాళేశ్వరుడి విగ్రహంలో స్వామి దక్షిణం వైపు చూస్తాడు. ఇంత ఖచ్చితంగా ఆ కాలంలో కాలరేఖను ఎలా కనిపెట్టారు? అదీ మిస్టరీ. GMTని మన భాషలో చెప్పాలంటే మహా కాలం అంటారు. అంటే గ్రేట్ టైమ్. మహా కాల రేఖ మీద ఉన్న ప్రాంతం కాబట్టే ఉజ్జయినిలో ఉన్న కాల దేవుడికి మహా కాలేశ్వర్వుడు అనే పేరు వచ్చింది. ఈ సృష్టిని లయం చేసేది, కాలాన్ని అదుపులో పెట్టేది శివుడే. అలా కాల దేవుడి పేరు మీదా ఉజ్జయిని కాలేశ్వరుడు వెలిశాడు. అదే రాను రాను మహా కాళేశ్వరుడు అయింది. ఇప్పటికీ జాతకం వేసినప్పుడు ఉజ్జయినీలో కాలానికి తగ్గట్టుగానే జాతక చక్రం వేస్తారు. అక్కడి సమయాన్ని ప్రధాన సమయంగా తీసుకుని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న సమయాన్ని సర్దుబాటు చేసి జ్యోతీష్యం చెప్తారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ అక్షాంశాలు రేఖాంశాలను బట్టి టైమ్ డిసైడ్ చేసే టెక్నాలజీని మోడ్రన్ సైన్స్ 1884లో కనిపెట్టింది. అంటే 150 ఏళ్లు కూడా కాలేదు. కానీ కర్కట రేఖ ఈ ఉజ్జయినీ నుంచే వెళ్తుందని వేల ఏళ్ల క్రితమే మన భారతీయులు కనిపెట్టారు. సరిగ్గా ఆ రేఖ వెళ్లే ప్రాంతంలోనే మహా కాళేశ్వరుడి శివలింగం స్వయంభూగా ఏర్పడింది. అది కూడా మహా కాలేశ్వరుడు అనే పేరుతో పిలుచుకోవడమేంటి. ఇదంతా శివలీల. మరో విషయం ఏంటంటే ఉజ్జయినిలో మన ప్రాచీన గణిత శాస్త్రవేత్తలు భాస్కరాచార్యుడు, వరాహ మిహిరుడు లెక్క కట్టిన ప్రైమ్ టైమ్‌కి, ఇప్పటి GMT సమయానికి తేడా జస్ట్ 29 నిమిషాలు మాత్రమే. ఏ టెక్నికల్ టూల్స్ లేవని చెప్తున్న సమయంలో ఇవన్నీ ఎలా కనిపెట్టారు?

ఉజ్జయినిలో కాలం పై పరిశోధనలు క్రీస్తు పూర్వం నుంచే ఉన్నాయని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ ప్రాచీన సన్ డయల్, అంతరిక్ష పరిశోధన శాలలు ఉన్నాయి. ఉజ్జయిని మహా కాళేశ్వరుడి గర్భగుడిలో శంఖు యంత్రం ఉంటుంది. కర్కట రేఖలో సమయం మార్పులను బట్టి ఏ కాలంలో వర్షం పడుతుంది, ఎప్పుడు చలికాలం వస్తుందని గుర్తించే యంత్రం అది. గుప్తుల స్వర్ణయుగం కాలంలో ఉజ్జయిని ఒక మెయిన్ సిటీ. ఆ కాలంలోనే వరహా మిహీర, భాస్కరాచార్య లాంటి అద్భుత గణిత శాస్త్రవేత్తలు ఉజ్జయినిలో పరిశోధనలు చేశారు. 4 వ శతాబ్దంలో సూర్యసిద్ధాంతం అనే గ్రంధాన్ని రచించారు. ఆ గ్రంథంలోనే ఉజ్జయిని జాగ్రఫీ గురించి క్లియర్‌గా ఉంది. కర్కాటక రేఖ సున్నా డిగ్రీల మీద ఉజ్జయిని ఉందని సూర్యసిద్ధాంతంలో ఉంది. భూమి వ్యాసం 36 వేల 788 కిలోమీటర్లు. దాని చుట్టూ ఉండే ఊహా రేఖల్లో కాలాన్ని చెప్పే రేఖ కర్కట రేఖ అంటారు. ఇది భారత్‌లో రాజస్థాన్, గుజరాత్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లాంటి రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఇప్పుడంటే శాటిలైట్లు అవీ వచ్చాయి కాబట్టి ఇవన్నీ తెలుసుకోవడం సులువు. ఈ కర్కట రేఖను సూర్యసిద్ధాంతం రాసిన గణిత శాస్త్రవేత్తలు 4వ శతాబ్దంలోనే ఎలా కనుక్కున్నారన్నది మిస్టరీ. కొంతమంది ఈ సూర్యసిద్ధాంత గ్రంథం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం అని కూడా చెప్తుంటారు. పైగా సూర్య సిద్ధాంతంలో ఉన్న కర్కట రేఖ, మకర రేఖ పేర్లనే ఇప్పటికీ ప్రపంచమంతా వాడుతోంది. కర్కట రేఖని ఇంగ్లీష్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ అంటే కర్కాటకం. మన వాళ్లకు ఈ కర్కట రేఖ, మకర రేఖల గురించి వేల ఏళ్ల క్రితమే తెలుసు అనడానికి మరో సాక్ష్యం మకర సంక్రాంతి. సూర్యుడు కర్కట రేఖ నుంచి మకర రేఖలోకి వచ్చే సమయాన్ని మనం ఉత్తరాయణ పుణ్యకాలం అంటున్నాం. ఆ సమయంలోనే మనం మకర సంక్రాంతి చేసుకుటున్నాం. తరతరాలుగా సంక్రాంతి భారత సంప్రదాయం. సూర్యుడు మకర రేఖ నుంచి కర్కట రేఖలో ఉన్న సమయాన్ని దక్షిణాయనం అని పిలుస్తాం. కాలాన్ని ఇంత క్లియర్‌గా విభజించుకున్న దేశం ఇంకొకటి లేదు. ఈ రేఖల మధ్య సూర్యుడు కదలికలను బట్టే మన వాళ్లు వేసవి, వర్షాకాలం, శీతాకాలాలను గుర్తించేవారు. వాటి ప్రకారమే పండుగలు పెట్టారు. కాలాన్ని కొలిచే శాస్త్రాన్ని ప్రపంచానికి అందించినది భారతదేశమే. అలాంటి టైమ్ లాబొరేటరీ ఉజ్జయినీ మహాకాళేశ్వర ఆలయం. ఆ కాలానికి ప్రధాన కూడలి ఉజ్జయిని. అంతరిక్ష శాస్త్రంలో మన శాస్త్రవేత్తలు ఏ స్థాయిలో పరిశోధనలు చేశారో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. సూర్య సిద్ధాంతాన్ని చాలా దేశాల వారు తమ భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసుకున్నారు.
మరో అద్భుతం ఏంటంటే ఈ కర్కట రేఖ ఏయే రాష్ట్రాల్లోంచి వెళ్తుందో ఆ రాష్ట్రాల్లో అందుకు సూచికగా శివాలయాలు ఉన్నాయి. ఉజ్జయినిలో మహా కాళేశ్వర ఆలయం ఉంటే. గుజరాత్‌లో సోమ్‌నాథ్ ఆలయం ఉంది. రెండూ జ్యోతిర్లింగాలే. ఈ జ్యోతిర్లింగాల వెనుక అంతరిక్ష శాస్త్ర రహస్యాలు ఉన్నాయి. ఇదే రేఖ ఉజ్జయినిలోనే ఉన్న మంగళనాథ్ ఆలయం గుండా కూడా వెళ్తుంది. మంగళ గ్రహం అంటే మార్స్. అంగారక గ్రహం. భూమి నుంచి అంగారక గ్రహానికి నియరెస్ట్ పాయింట్ ఇదేనని కొందరు పరిశోధకులు చెప్తున్నారు. అందుకు సూచికగానే అంగరాక గ్రహానికి ఒక ఆలయం కట్టారు ఉజ్జయిని చక్రవర్తులు. ఇంతలా అంతరిక్ష శాస్త్రాన్ని రీసెర్చ్ చేశారంటే ఆ కాలంలో ఇప్పటికి మించి టెక్నాలజీ అయినా ఉండి ఉండాలి. లేదంటే అతీత శక్తులైనా ఉండి ఉండాలి. అంతరిక్ష శాస్త్రంపై రాజస్థాన్ రాజు సవాయ్ జయ్‌సింగ్‌కి చాలా ఇంట్రస్ట్ ఉండేది. ఆయనే ఢిల్లీలో జంతర్ మంతర్ నిర్మించారు. ఆయన 1725లో మొట్టమొదట ఉజ్జయినిలో స్పేస్ అబ్జర్వేటరీలు నిర్మించారు. అంటే గ్రీనిచ్ కంటే ముందే ఉజ్జయినిలో ప్లానెటరీ ఉంది. అప్పట్లో భారతీయ గురుకులాల్లో మ్యాథ్స్, ఆర్కిటెక్చర్, ఆస్ట్రోనమి సిలబస్‌లో ప్రధానంగా ఉండేవి. వరాహా మిహిరుడు, భాస్కరాచార్యుడు, బ్రహ్మ గుప్తుడు ఉజ్జయినిలో ఎంతో కాలం పరిశోధనలు చేశారు. ఇలాంటి అద్భుతమైన మేధావులను పోషించిన ఉజ్జయిన చక్రవర్తి విక్రమాదిత్యుడు. ఆయన పేరు మీదే విక్రమ శకం వచ్చింది. ఇప్పుడు క్రీస్తుశకం వచ్చినా… హైందవ ముహూర్తాలకు ఇప్పటికీ విక్రమ శకమే మనకు ప్రామాణికం. క్రీస్తుపూర్వం 58లో విక్రమశకం ప్రారంభమైంది.

అంతేకాదు మరో అద్భుతం. భారత దేశంలో ఉన్న సూర్య దేవాలయాలు భూమి మీద నార్త్ లాటిట్యూడ్‌కి 23 డిగ్రీల ప్రాంతంలో ఉన్నాయి. ఎందుకంటే నార్త్ లాటిట్యూడ్‌లో 23.5 డిగ్రీలో ఉన్న రేఖనే కర్కట రేఖ అంటాం. అంత ఖచ్చితంగా దేశంలో ఉన్న సూర్య దేవాలయాలన్నీ కర్కట రేఖ మీదే ఎలా కట్టారు? మన ప్రాచీన శాస్త్రవేత్తల కాల జ్ఞానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కాలాన్ని నడిపించేవాడు సూర్యుడు. కాలాన్ని నడిపించే రేఖ కర్కట రేఖ. అందుకే ప్రాచీన సూర్యదేవాలయాలు భూమధ్య రేఖకు 23న్నర డిగ్రీల రేఖాంశాల మీద ఉన్నాయి. మధ్య ప్రదేశ్‌లో వెలిసిన స్వయంభూ లింగం మహాకాళేశ్వరుడుని మధ్యేశ్వరుడు అని కూడా పిలుస్తారు. కాలరేఖకు సరిగ్గా నాభి ప్రాంతంలో మహా కాళేశ్వరురుడు ఉన్నందుకు ఆ పేరు. 12 జ్యోతిర్లింగాల్లో ఉజ్జయిని మహా కాళేశ్వర క్షేత్రం చాలా ప్రత్యేకమైనది. ఐదు అంతస్తుల్లో ఈ దేవాలయం ఉంటుంది. వాటిలో ఒక అంతస్తు భూమి లోపల ఉంటుంది. అక్కడే కాలంలో మార్పులను చెప్పే ప్రాచీన శంఖుయంత్రం ఉంది. ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు కాలంపై చేసిన పరిశోధనలకు సాక్ష్యమే ఉజ్జయిని మహా కాలేశ్వరుడి క్షేత్రం. ఉజ్జయిని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడి అమ్మవారు పేరు ఉజ్జయిని మహాకాళి. కాలాన్ని అదుపులో పెట్టేది కాళేశ్వరుడు అయితే, కాలాన్ని హరించి కొత్త కాలంలోకి తీసుకెళ్లే శక్తి కాళీ. కాలం నుంచి వచ్చిన పేరే కాళీ. భోజరాజు పాలించిన రాజ్యం ఉజ్జయినీ. విక్రమాదిత్య సహా ఎంతో మంది చక్రవర్తులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఉజ్జయిని మహాకాళి సమక్షంలోనే మహాకవి కాళిదాసుకి జ్ఞానోదయం అయింది. ఇలాంటి గొప్ప ఆలయం చరిత్రను భారతీయులందరూ తెలుసుకోవాలి.
SATISH KOTTHURI, SR.JOURNALIST