June 3, 2023

తిరుమల న్యూస్‌- ఆన్‌లైన్‌లో 69,512 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు

తిరుమల న్యూస్‌- ఆన్‌లైన్‌లో  69,512 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్‌ డిప్‌ ద్వారా తీస్తున్న విషయం భక్తులకు తెలిసిందే. ఈ సేవలకు సంబంధించి ఫిబ్రవరి కోటాలో మొత్తం 69 వేల 512 టికెట్లను నవంబర్‌ 1 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. వీటిలో సుప్రభాతం- 7332, తోమాల సేవ-120, అర్చన-120, అష్టదళపాద పద్మారాధన-240, నిజపాద దర్శనం టికెట్లు-2300 ఉన్నాయి. ఇవన్నీ మూల విరాట్టుకి నేరుగా జరిగే పూజలు. కాసేపు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించే భాగ్యం దొరుకుతుంది.

ఆన్‌లైన్‌ జనరల్‌ కేటగిరీలో 59 వేల 400 సేవా టికెట్లు ఉన్నాయి. ఈ విభాగంలో విశేష పూజ– 2000, కళ్యాణం-13300, ఊంజల్‌ సేవ-4200, ఆర్జిత బ్రహ్మోత్సవం– 7700, వసంతోత్సవం-15400, సహస్రదీపాలంకార సేవ– 16800 టికెట్లు ఉన్నాయి. ఇవి నేరుగా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. ఇవి ఉత్సవ మూర్తులకు జరిగే సేవలని గమనించాలి.

న‌వంబ‌రు 5న ఫిబ్రవరికి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేస్తారు. ఆన్‌లైన్‌, దర్శన్‌ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.


About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *