అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ.. సైరట్ రీమేక్ ధడక్‌తో మంచి మార్కులే కొట్టేసింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. ఇప్పుడు మరో తార అవే క్యూట్ లుక్స్‌తో కమింగ్ సూన్ అంటోంది. ఆమె కింగ్‌ఖాన్ షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్.
అయితే ఆమె నేరుగా సిల్వర్ స్క్రీన్‌కి రావడం లేదు. ముందో ఫ్యాషన్ షూట్ తనేంటో చూపిస్తోంది. ఈ మధ్య వోగ్ మ్యాగ్జైన్ కోసం ఆమె ఓ ఫోటో షూట్ ఇచ్చింది. ఆ కవర్‌పేజ్‌ని తండ్రి షారుఖ్ విడుదల చేశారు.
18 ఏళ్ల సుహానా సెన్సిటివ్, స్ట్రాంగ్ క్యాపబిలిటీస్ ఉన్నదని కవర్ పేజ్ విడుదల సందర్భంగా షారుఖ్ అన్నారు. సుహానాని ఇంత అందంగా చూపించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.
ఈ మధ్య సుహానా ఏ స్టిల్ పెట్టినా వైరల్ అవుతున్నాయి. కింగ్‌ఖాన్ కూతురు కదా.. ఆమెను సిల్వర్ స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు.
మరి ఆల్రెడీ జాన్వీ పాసైపోయింది. మరి సుహానా ప్రీ–ఎక్సామ్ సూపర్ రిజల్ట్ వచ్చింది. మరి సిల్వల్ స్క్రీన్ ఎక్సామ్‌లో పాసవుతుందని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ సుహానా.