June 7, 2023

తాజ్‌ను రక్షిస్తారా? లేదా?- ప్రభుత్వంపై సుప్రీం సీరియస్‌

తాజ్‌ను రక్షిస్తారా? లేదా?- ప్రభుత్వంపై సుప్రీం సీరియస్‌

వెండి వెన్నెల్లో ఇలపై నిండు పున్నమిలా కనిపించే తాజ్‌ మహల్‌ క్రమక్రమంగా అందాన్ని కోల్పోతోంది. ఈ విషయంపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతూ సుప్రీంలో కేసువేశారు. తాజ్‌ పరిరక్షణ విషయంలో సుప్రీం ఘాటుగా స్పందించింది.తాజ్‌మహల్‌ సంరక్షణ విషయంలో యూపీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా లేదని, ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవడం లేదని చురకలు వేసింది. “ తాజ్‌ మహల్‌ను కూల్చేస్తారా? పరిరక్షణ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారా? లేదా తాజ్‌ మూసేస్తారా? అంటూ ఘాటుగా ప్రశ్నించింది.. సుప్రీం. ఏటా 80 లక్షల మంది సందర్శించే పారిస్‌ ఐకాన్‌ ఈఫిల్‌ టవర్‌ కంటే తాజ్‌ అందమైనదనిసక్రమంగా నిర్వహిస్తే విదేశీ మారక ద్రవ్య సమస్యను తాజ్‌ తీర్చగలదని.. సుప్రీం తెలిపింది. తాజ్‌ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల దేశానికి నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది. తాజ్‌ మహల్‌ రంగు మారిపోతోందంటూ..దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది మేలో సుప్రీం కోర్టుకేంద్రాన్ని ఆదేశించింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ తీసుకున్న చర్యల నివేదికలను సమర్పించాల్సిందిగా కేంద్రానికి సూచించింది. ఈ అంశాలపై కేంద్రం తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. తాజ్‌ మహల్‌పై పరిశోధించడానికి, నష్టశాతాన్ని అంచనా వేయడానికి ఇప్పటికే ప్రత్యేక కమిటీని నియమించామని పేర్కొన్నారు. నాలుగు నెలల్లో నివేదిక సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *