ఏదో జరుగుతుందనుకుంటే… మొదటికే మోసమొచ్చింది. తెలంగాణ కాంగ్రెస్‌కి తెలుగు దేశం పార్టీ వాస్తు అస్సలు సెట్ కాలేదు. ఏ ముహూర్తాన టి.కాంగ్రెస్, టీడీపీ కలిశాయో.. ఆ క్షణానే బ్యాడ్ డేస్ మొదలైపోయాయి. బాబు గారి లెగ్గు పుణ్యమో ఏమో గానీ తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్తమ్ కుమార్ తప్ప ఇంకెవరూ మిగిలేట్టు లేరు. ఈ మధ్యే రేగా కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్‌లు మంచి రోజు చూసుకుని గులాబీ కండువా కప్పేసుకున్నారు. కాంగ్రెస్‌కి అసలు షాక్ అంటే చేవెళ్ల చెల్లెమ్మ ఇచ్చారు. కాంగ్రెస్‌తో అత్యంత అవినాభావ సంబంధం ఉన్న సబితా ఇంద్రారెడ్డి కూడా కేసీఆర్ టీంలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు మరో షాక్. కాంగ్రెస్‌లో బలమైన నాయకుడు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. శుక్రవారం కేటీఆర్‌ని కలిశారు. రోజు మారుతోందంటే తెలంగాణ కాంగ్రెస్ గుండె గుబేల్ మంటోంది. ఈ రోజు గాంధీ భవన్‌లో కనిపించిన వారు… రేపు టీఆర్‌ఎస్ భవన్‌లో తేల్తున్నారు. పాపం.. గాంధీ భవన్ ఖాళీ అవుతోంది. అటు ఏపీలోనూ కాంగ్రెస్ పరిస్థితి ఇలానే ఉంది.
Related Posts
వాట్సాప్ పేమెంట్ సర్వీస్… సురక్షితమేనా ?
ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం
July 1, 2018
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్
July 1, 2018
ఆగస్ట్ 27లోగా రాకపోతే… విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే
ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా వేరే
July 1, 2018
వాహ్ క్యా ట్రైలర్ హై! దుల్కర్ అదరగొట్టాడు…
దుల్కర్ సల్మాన్… మన తెలుగులో ఓకే బంగారం సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటికే
July 1, 2018
విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి
ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో
July 3, 2018