హమ్మయ్య.. థాయ్‌లాండ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు, వారి ఫుట్‌బాల్ కోచ్ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అత్యంత సాహోసోపేతంగా.. డైవర్లు పిల్లలను కాపాడారు. జూన్ 23న 12 మంది చిన్నారులు తమ ఫుట్‌బాల్ కోచ్‌తో థాయ్‌లాండ్‌లోని ప్రఖ్యాత తామ్ లుయాంగ్ గుహ చూడడానికి వెళ్లారు. వరద ఉద్ధృతి పెరిగి గుహ అంతా నీళ్లతో నిండిపోయి అక్కడే చిక్కుకుపోయారు. 9 రోజుల ఉత్కంఠ తర్వాత వారిని బ్రిటిష్ గజ ఈతగాళ్లు కనిపెట్టారు. కానీ, గుహ లోపల నీటి మట్టం పెరగడం, బురద వల్ల చిన్నారులను బయటకు తీసుకురావడం ఛాలెంజ్‌గా మారింది. పిల్లలెవ్వరికీ ఈత రాకపోడం, 9 రోజులుగా ఆహారం లేక నీరసించిపోడం వల్ల పరిస్థితి మరీ క్రిటికల్ అయింది. చివరికి.. విదేశీ డైవర్లు, థాయ్ డైవర్ల సాహసించి చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
Related Posts
వాట్సాప్ పేమెంట్ సర్వీస్… సురక్షితమేనా ?
ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం
July 1, 2018
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్
July 1, 2018
ఆగస్ట్ 27లోగా రాకపోతే… విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే
ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా వేరే
July 1, 2018
వాహ్ క్యా ట్రైలర్ హై! దుల్కర్ అదరగొట్టాడు…
దుల్కర్ సల్మాన్… మన తెలుగులో ఓకే బంగారం సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటికే
July 1, 2018
విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి
ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో
July 3, 2018