June 3, 2023

గూస్‌బంప్స్‌… తలైవి ట్రైలర్‌ చూశాక ఇంతకన్నా మరో మాట దొరకలేదు. సూపర్‌ స్టార్‌గా, టాప్ పొలిటీషియన్‌గా, అందం, అంతకు మించిన విద్య ఇన్ని క్వాలిఫికేషన్స్‌ ఉన్న మహిళను చాలా అరుదుగా చూస్తాం. ఇవన్నీ ఉన్న అదృష్టవంతురాలు, అదే సమయంలో దురదృష్టవంతురాలు జయలలిత.ఆమె జీవితమంతా ముళ్ల దారులే. ఆమె జీవితమంతా ఒంటరితనమే. ఆమె కథ ఓ చరిత్ర. ఆమె కథ ఒక బ్లాక్‌ బస్టర్‌ సినిమా కథ. ఇలాంటి కథలో గతంలో వచ్చిన వెబ్‌సిరీస్‌ కూడా హిట్టయింది. MX ప్లేయర్‌లో క్వీన్‌గా వచ్చిన జయలలిత బయోగ్రఫిలో రమ్య కృష్ట అదరగొట్టారు. అయితే తలైవీ సినిమాలో కంగనా ఒన్‌ వుమెన్‌ షో. ఉత్తమ నటిగా నేషనల్‌ అవార్డు కొట్టిన ఊపులో విడుదలైన ఈ ట్రైలర్‌ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లింది. గతంలో ఎంజీఆర్‌-కరుణానిథి రిలేషన్స్‌తో తీసిన ఇద్దరు సినిమా క్లాసిక్‌ అని పేరుతెచ్చుకున్నా ఫ్లాప్‌. ఆ కథలో క్యారెక్టర్లు తెలుగువారికి పెద్దగా పరిచయం లేదు. కానీ జయలలిత యూనివర్సల్‌ స్టార్‌.ఆ స్థాయిలో ఆమె దేశం మొత్తం తెలుసు. ట్రైలర్‌ చూస్తుంటే జయలలితలో కసిని, కోపాన్ని రగిల్చిన ప్రతీ సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరించినట్టు కనిపిస్తోంది.అసెంబ్లీలో ఆమె చీర లాగడం, ఎంజీఆర్ అంతిమయాత్ర సమయంలో ఆమెను వ్యాన్‌ నుంచి తోసేయడం.. ఇవన్నీ యదార్థ ఘటనలు. ఆ అవమానం నుంచి పుట్టిన బడబాగ్ని నుంచే సీఎం జయలలిత పుట్టింది. ప్రతీ సీన్‌లోనూ కంగన కష్టం కనిపిస్తోంది. ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూద్దాం.

About Author

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *