June 7, 2023

ఇక మీ ఆటలు సాగవు!

ఇక మీ ఆటలు సాగవు!

ఆర్టికల్‌ 370, 35-A రద్దు తర్వాత పాకిస్థాన్‌కి చుక్కలు కనిపిస్తున్నాయి. ఏం చేస్తున్నారో వాటి ఫలితాలు ఏంటో కూడా ఆ దేశానికి అర్థం కావడం లేదు.ఆఖరికి థియేటర్లలో ఇండియన్‌ మూవీస్‌ షోలు ఆపేస్తున్నారు. భారత్‌పై పాక్‌కి ఉన్న ద్వేష భావానికి పరాకాష్ట ఇది. ఇప్పుడు రైళ్లు ఆపేస్తారట. ఇప్పటికే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ని ఆపేశారు. ఇప్పుడు భారత్‌పాక్‌లను కలిపే థార్‌ ఎక్స్‌ప్రెస్‌ని కూడా నిలిపేస్తున్నట్టు.. పాక్‌ రైల్వే శాఖ మంత్రి ప్రకటించారు. దీనికి తోడు ఆయన పదవిలో ఉన్నన్నాళ్లు ఇక ఇండియాకి పాక్‌ నుంచి రైళ్లు నడపరట.ఎవరికి నష్టం..? ఇప్పుడు పాకిస్థాన్‌ భారత్‌ సహా ఇతర దేశాలపై ఆధారపడుతూ బతుకుతోంది. ఆ దేశం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సుస్థిర ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసుకోలేకపోయింది. సరైన విధానాలే లేవు. సైన్యం నిర్ణయాలే అక్కడ ఫైనల్‌. పాక్‌ అభివృద్ధిపై అక్కడి ప్రజలకు గానీ, ప్రభుత్వాలకు గానీ ఏ మాత్రం శ్రద్ధ లేదు. ఇప్పుడు ఇండియాతో గొడవ పెట్టుకుంటే నష్టపోయేది పాకిస్థానే. మనకు పోయేదేమీ లేదు. పాకిస్థాన్ ఇండియా రాయాబారిని తీసేయడం, అంతర్జాతీయ సమాజం వాతలు పెడుతున్నా వాళ్లకు కంప్లైంట్‌లు చేయడం ఇలాంటి పనుల వల్ల ఇమ్రాన్‌ అజ్ఞానం బయటపడడం తప్ప ఆ దేశానికి ఒరిగేదేమి లేదు. కశ్మీర్‌ విషయంలో భారత్‌ చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఇది మోడీ ప్రభుత్వం. ఇన్నాళ్లు శరీరాలు కశ్మీర్‌లో, ఆత్మలు పాకిస్థాన్‌లో తిరిగే కొందరు కశ్మీర్‌ నాయకుల స్వార్థం వల్లే.. 370 ఆర్టికల్‌ దుర్వినియోగం అయింది. ఇప్పుడు చొరబాట్లు అంత సులువు కావు, కేంద్ర ప్రభుత్వ పాలన అమలైతే..ఇకపై ఉగ్రవాదుల ఆటలు సాగవు. ఒక్క దెబ్బతో మోడీ చెక్‌ పెట్టారు. పోనీ.. ఇమ్రాన్‌కి ఇతర దేశాల మద్దతుందా? లేదు.. అవసరానికి వాడుకుని వదిలేసే చైనా మద్దతుతో పాక్‌కి ఒరిగేదేమీ లేదు. కనీసం ఇస్లాం కంట్రీల నుంచి కూడా పాకిస్థాన్‌కి మద్దతు లేదు. ఆర్టికల్‌ 370 రద్దుని ఆల్‌మోస్ట్‌ అన్ని ముస్లిం దేశాలు ఆహ్వానించాయి. ఇక ఇమ్రాన్‌ఖాన్‌కి ఎందుకింత మిడిసిపాటో ఆయనే తెలుసుకోవాలి. బెదిరిస్తే భయపడిపోడానికి, చర్చలతో కాలయాపన చేయడానికి ఇప్పుడున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదని ఇమ్రాన్ తెలుసుకోవాలి. కొంత మంది స్వయం ప్రకటిత మేధావులు, తప్పు పట్టడం తప్ప వేరే ఎజెండానే లేని కొందరు నాయకులు తప్ప మిగిలిన భారతీయులంతా కశ్మీర్‌ని భారత్‌ అంతర్భాగంగా కోరుకుంటున్నారు.ఇక ఈ విషయంపై భారత్‌ క్లారిటీగానే ఉంది.. క్లారిటీ తెచ్చుకోవాల్సింది పాకిస్థానే.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *