June 3, 2023

భారీగా మిగిలిపోయిన తిరుమల లడ్డూలు

భారీగా మిగిలిపోయిన తిరుమల లడ్డూలు

తిరుమలలో వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా ఆగిపోయిన దర్శనాల వల్ల 2 లక్షల లడ్డూలు మిగిలిపోయాయి. ఆ లడ్డూలను ఉగాది నాడు ఉచితంగా పంచిపెట్టాలనే తయారు చేశారు. వాటిని భక్తులకు ఉచితంగానో, డబ్బులకో ఇవ్వొచ్చు కదా. అలా చేస్తే వారు తిరుమల ఉద్యోగులు ఎందుకవుతారు? ఇప్పుడు ఆ లడ్డూలను ఉద్యోగుల కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించారు. భక్తులకు ఇస్తే కనీసం సంతృప్తిగానైనా తిరిగివెళ్తారు. నిత్యం సన్నిధిలోనే ఉండే ఉద్యోగులకు లడ్డూలెందుకు? ఏంటో టీటీడీ అధికారులు ఒక్కోసారి చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. తిరుమల శ్రీవారి లడ్డూకి ఉన్న డిమాండ్‌ అంతా ఇంతానా. అలా అలపిరి దగ్గర పెడితే 2 లక్షల లడ్డూలు రెండు గంటల్లో అయిపోతాయి. భక్తుల డిమాండ్‌ని బట్టి లడ్డూలు తయారు చేసి నిల్వ చేస్తుంటారు. ఈ సారి అలాగే 2 లక్షల లడ్డూలు చేశారు. కానీ అనుకోకుండా దర్శనాలు నిలిపివేశారు. మళ్లీ దర్శనాలు ఎప్పుడో కరెక్టుగా తెలియదు. ఇప్పుడా లడ్డూలు ఏం చేయాలి? భక్తులకు పంచితే మహా ప్రసాదం అనుకుని తీసుకునేవారు. కానీ ఆ భాగ్యం టీటీడీ ఉద్యోగులకు దక్కింది.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *