‘క్యా ఖోయా… క్యా పాయా…’ అటల్‌జీ రాసిన గొప్ప కవితల్లో ఇది ముఖ్యమైనది. ఏం పొగొట్టుకున్నాను.. ఏం పొందాను అని ఆ కవిత అర్థం. 16 ఏళ్ల క్రితం 2002లో ప్రముఖ చిత్ర నిర్మాత యాష్ చోప్రా ఈ అద్భుత కవితకు దృశ్యరూపం ఇచ్చారు. వరుస హిట్లతో షారుఖ్ సూపర్ ఫామ్‌లో ఉన్న సమయమది. ఆ కవితా దృశ్య రూపంలో షారుఖ్ నటించారు. ఈ కవితకు ముందు మాట జావేద్ అఖ్తర్ రాస్తే, ఆ ముందు మాటకు అమితాబ్ గళం అందించారు. ఘజల్స్‌కే కొత్త కళ తెచ్చిన జగ్జీత్ సింగ్ సంగీతంతో పాటు గాత్రాన్ని అందించారు. ఆ కవితా మేఘాల్లో కురిసే అక్షర చినుకుల దృశ్య రూపాన్ని మీరు ఆస్వాదించండి. ఇదిగో ఆ వీడియో
https://www.youtube.com/watch?time_continue=5&v=2Im6b_jFuO4