June 7, 2023

Article By పార్థసారధి పోట్లూరి, న్యూస్ అనలిస్ట్‌

మనం BBC కి అండగా ఉందాం ! బ్రిటన్ పార్లమెంట్ !

‘We stand up for BBC’ ! భారత ఆదాయపన్ను శాఖ BBC కార్యాలయాలలో సర్వే చేసిన తరువాత బ్రిటన్ పార్లమెంట్ చేసిన వ్యాఖ్య ఇది !

మనం బిబిసి కి అండగా ఉందాం ! మనం స్థాపించిన BBC వరల్డ్ న్యూస్‌ సమర్ధిద్దాం. BBC ఎడిటోరియల్‌కి ఆ స్వాతంత్ర్యం ఉంది! పార్లమెంట్ అండర్ సెక్రటరీ ఆఫ్ FCDO… డేవిడ్‌ రూట్లే. FCDO అంటే Foreign, Commonwealth & Development Office (FCDO). జూనియర్‌ మినిస్టర్‌ అయిన డేవిడ్ రుట్లే బ్రిటన్ పార్లమెంట్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఇది! ఇది భారత సార్వభౌమత్వాన్ని, నిర్ణయ అధికారాలను అవమానించినట్టే. అఫ్కోర్స్ అబద్ధాలని ప్రచారం చేయడంలో శతాబ్దానికి పైగా అనుభవం ఉన్న బిబిసికి బ్రిటన్‌లో ఆ మాత్రం సమర్ధన ఉంది అంటే ఆశ్చర్యంగా ఉంది!

********************

బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు మరియు FCDO జూనియర్ మినిస్టర్ అయిన డేవిడ్ రూట్లే ఒక డొంక తిరుగుడు వ్యాఖ్య చేశాడు. 21-02-2022 మంగళవారం రోజున బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఒక అత్యవసర ప్రశ్నకి స్పందిస్తూ భారత ఆదాయపన్ను శాఖ BBCకి చెందిన ఢిల్లీ, ముంబై కార్యాలయాలలో చేసిన సర్వే గురించి ఎలాంటి వ్యాఖ్య చేయబోమని అంటూనే వాక్ స్వాతంత్ర్యం మరియు పత్రికా స్వేచ్చ అనేవి ప్రజాస్వామ్యానికి కావాల్సిన ముఖ్యమైన అంశాలు అంటూ వారు పాటించని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఇది భారత దేశ సార్వభౌమ అధికారాన్ని ప్రశ్నించినట్లే కదా ? భారత దేశంలో జరిగే వ్యవహారాలపై మాట్లాడేందుకు బ్రిటన్‌కి అధికారం లేదు ! అలాంటప్పుడు పన్ను అధికారుల సర్వేకి బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీకి ముడి పెట్టడం ఎందుకు ?

****************

పైగా Robust Democracyలకు పత్రికా స్వేచ్ఛ ముఖ్యం అన్నాడు డేవిడ్ రుట్లే ! రోబస్ట్ డెమొక్రసీ అంటే ఎంటో తెలుసా ? బ్రిటన్‌లా హౌస్ ఆఫ్ కామన్స్‌లో బ్రిటన్ రాణి లేదా రాజుతో పాటు 26 మంది క్రైస్తవ మత గురువులు ప్రజాస్వామ్యాన్ని శాసిస్తారు. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌కి చెందిన 26 మంది బిషప్‌లు బ్రిటన్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో బ్రిటన్ రాణితో కలిసి దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్ చేసే చట్టాలని పర్యవేక్షిస్తారు. అసలు ఇలాంటి వ్యవస్థను ఎవరైనా ప్రజాస్వామ్యం అంటారా? ఇది ఫ్యూడల్ వ్యవస్థ కాదా ? ప్రజాస్వామ్యంలో ఎగువ సభకి మత గురువులని ఎలా నామినేట్ చేస్తారు ? ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు చేసే చట్టాలని మత గురువులు సమీక్షిస్తారా ? సలహాలు,సూచనలు ఇస్తారా ? ఇలాంటి వ్యవస్థ పటిష్టమైన ప్రజస్వామ్య వ్యవస్థ అయిన భారతలో ఉంటుందా? Robust Democracyలో పత్రికా స్వేచ్ఛ ఉండాలని డేవిడ్‌ రూట్లే భారత్‌ని ఉద్దేశించి అంటే… అది మన ప్రజాస్వామ్య వ్వవస్థను అవమానించినట్టే. మన పార్లమెంట్‌లో ఎలాంటి మత గురువులు ఉండరు! భారత పార్లమెంట్‌లో భారత దేశపు రాజు కానీ రాణి కానీ ప్రాతినిధ్యం వహించరు. మనదీ అసలైన ప్రజాస్వామ్యం. కానీ భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని బ్రిటన్‌ గోల పెట్టడం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్‌.

మత గురువులు ప్రాతినిధ్యం వహించే బ్రిటన్ పార్లమెంట్ ఇచ్చే నిధుల మీద నడిచే ఛానెల్‌ BBC. అలాంటి BBC పన్ను ఎగవేతకి పాల్పడిందా లేదా అని సర్వే చేస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అయిపోయిందని బ్రిటన్‌ అన్న మాటలు ఎంత హాస్యాస్పదం? నిత్యం భారత్‌ని అవమానించే వార్తలకే ప్రాధాన్యం ఇచ్చే BBC మనకు అవసరమా? భారత్‌లో ఇప్పటికే అవసరానికి మించి ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు ఉన్నాయి కదా ?

డేవిడ్ రుట్లే కధనం ప్రకారం బ్రిటన్ FCDO అంటే Foreign, Commonwealth & Development Office ఇస్తున్న నిధులతో మొత్తం 12 భాషల్లో బిబిసి వరల్డ్ న్యూస్ తన కార్యకలాపాలని నిర్వహిస్తోంది. 12 భాషల్లో ఈ ప్రపంచంలో అన్ని దేశాలూ సరిపోనట్టు 4 భాషలు మన దేశానికి సంబంధించినవే. తెలుగు, మరాఠీ,గుజరాతీ,పంజాబీ భాషల్లో BBC పనిచేస్తోంది… Well ! అక్కడే ఎందుకు BBC తిష్ఠ వేసింది. గత రెండు దశాబ్దాలకి పైగా గుజరాత్‌లో బిజేపి అధికారంలో ఉంది కాబట్టి అక్కడ BBC ఎక్కువ ఫోకస్‌ పెట్టిందా? రెండు తెలుగు రాష్ట్రాలలో బిజేపి అధికారంలోకి రాకుండా ఉండేందుకు BBC పనిచేస్తోందా? భారత దేశ ఆర్ధిక రాజధాని అయిన మహారాష్ట్రలో ఏ కారణంతో BBC యాక్టివిటీ స్టార్ట్‌ చేసింది? పంజాబ్‌లో కూడా BBC. ఎందుకో అందరికీ తెలుసు? ఇదే BBC తమిళనాడులో, కేరళలో ఉండదు. కేవలం తెలుగు, గుజరాతి, మరాఠి, పంజాబీ రాష్ట్రాలే BBCకి ఎందుకంత ఇష్టం? ఎందుకో డేవిడ్‌ రూట్లేనే స్పష్టంగా చెప్పాడు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

భారత్‌లో బ్రిటన్ మాట వినిపించాలి. అదీ Independent voice. అదీ అతని మాట. భారత్‌లో మీ మాట ఎందుకు వినిపించాలి ? భారత ప్రజల అభిప్రాయాలు ఏమిటో చెప్పడానికి ఇక్కడ లెక్కలేనన్ని ప్రసార మాధ్యమాలు ఉన్నాయి కదా ? కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు వేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లతో పాటు, సాక్షాత్తూ భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులని కాదని గుజరాత్ అల్లర్లకి మోడీ బాధ్యుడు అని చూపించే BBC డాక్యుమెంటరీ మన దేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేయడమే.

BUT…బిబిసి డాక్యుమెంటరీని ప్రధానిగా నేను సమర్ధించట్లేదు అని బ్రిటన్‌ ప్రధాని ఋషి శునాక్‌ అన్నారు ! ఋషి శునాక్ ఇలా అన్న వారంలోనే నార్త్‌ ఐర్లాండ్ MP అయిన జిమ్ షానాన్ అత్యవసరంగా దీనిమీద హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రశ్నించాలి అంటూ ప్రకటన చేశాడు. బ్రిటన్‌లోని డెమొక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ సభ్యుడు జిమ్ షానాన్భారత ప్రభుత్వం BBC మీద వివక్ష చూపిస్తూ ఆదాయపన్ను శాఖ ద్వారా BBCని అణిచివేయాలని చూస్తోందని తెగ బాధపడిపోయాడు. ఆ తర్వాతే డేవిడ్ రుట్లే స్పందించాడు. భారత్ బ్రిటన్‌ల మధ్య 2030 రోడ్ మాప్ కోసం చర్చలు జరుగుతున్న వేళ ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం విచారకరం అంటూ డేవిడ్ రుట్లే తెగ బాధపడిపోతున్నాడు పాపం. అవును మరి ఈ సారి అవసరం ఆ దేశానిది కదా ! యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బయటికి వచ్చాక ఆ దేశం దాదాపు దివాళా తీసింది. ఇప్పుడు అతి పెద్ద మార్కెట్ అయిన భారతదేశ అవసరం బ్రిటన్‌కి ఉంది. మరి అలాంటప్పుడు ప్రెస్ ఫ్రీడం పేరుతో భారత్ లో చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తే దానిని గట్టిగా ఎదుర్కునే హక్కు భారత దేశానికి ఉంటుంది అని తెలియదా? మీరు చేసిన తప్పుడు ఆరోపణలు సాక్షాత్తూ భారత ప్రధానిని ఉద్దేశించి చేశారు అన్నది మరిచిపోయి మీతో భారీ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలా ? ఇప్పుడు బాల్ భారత్‌ కోర్టులో ఉంది. ఇవి 1947 కాలం నాటి రోజులు కావు. కనీసం 2014కి ముందరి రోజులూ కావని బ్రిటనే గుర్తుపెట్టుకోవాలి.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *