June 7, 2023

ఛాట్ GPT కొన్నాళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న వర్డ్‌. ఏంటీ ఛాట్ GPT. ఛాట్ GPTని చూసి గూగుల్‌ లాంటి సంస్థే ఎందుకు భయపడింది? అప్పటికప్పుడు కౌంటర్‌గా బార్డ్‌ అనే ఛాట్‌బోట్‌ని ఎందుకు అనౌన్స్‌ చేసింది? చాలా సంవత్సరాల తర్వాత ఒక నిఖార్సైన కాంపిటేషన్ గూగుల్‌కి ఎదురైంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ బింగో సెర్చ్‌ ఇంజిన్‌ ఛాట్‌ GPTని లింక్‌ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. గూగుల్‌ తన AI ఛాట్‌బోట్‌ బార్డ్‌ని అనౌన్స్ చేసింది? ప్రపంచాన్ని ఏలుతున్న గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌నే భయపెట్టిన ఆ ఛాట్ GPT అంటే ఏంటో చూద్దాం…

గత సంవత్సరం అంటే 2022 నవంబర్‌లో OPEN AI ఛాట్‌ GPT లాంఛ్‌ అయింది. ఈ ఛాట్‌బోట్‌ని OPEN AI అనే సంస్థ లాంఛ్‌ చేసింది. లాంఛ్‌ అయిన వారంలో రోజుల్లోనే మిలియన్ల సబ్‌స్క్రైబర్లు వచ్చారు. ఇదో రికార్డ్‌. పెద్ద పెద్ద ఓటీటీలు, గూగూల్‌ యాప్‌లకు కూడా ఇంత తక్కువ సమయంలో ఈ రేంజ్ సబ్‌స్క్రైబర్లు రాలేదు. అందుకే ఒక్కసారిగా గూగుల్‌ షాక్‌ అయింది. ఇన్నాళ్లు మనకేదైనా డౌట్‌ వస్తే గూగుల్‌లో సెర్చ్ చేసేవాళ్లం.. ఇకపై ఛాట్‌ GPTలో సెర్చ్‌ చేస్తాం. అంతగా ఈ ఛాట్‌ GPT క్లిక్‌ అయింది. గూగుల్‌కి …ఈ ఛాట్ GPT రీప్లేస్‌మెంట్‌ అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ శకం గేరఅప్‌ అయిందని చెప్పేందుకు ఈ ఛాట్‌ GPT బిగ్ ఎగ్జాంపుల్‌. ఇప్పటికే చాలా ఛాట్‌బోట్‌లను మనం వాడుతున్నాం. మన ఏదైనా బ్యాంక్‌ యాప్‌ లేదా వాట్సాప్‌లో కస్టమర్‌ కేర్‌ ఛాట్‌లో టైప్‌ చేసినప్పుడు.. అటునుంచి ఆటోమేటిగ్గా రిప్లై వస్తుంది. అటువైపు ఎవరూ వ్యక్తులు ఉండరు. అక్కడో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కంప్యూటర్‌ ఉంటుంది. మనం అడిగిన ప్రశ్నకు అటువైపు ఉన్న రోబోటిక్‌ కంప్యూటర్‌ ఆన్సర్‌ చేస్తుంది. ఈ ఛాట్‌ బోట్‌ని ఇప్పుడుదాదాపు అన్ని బ్యాంకింగ్‌, సోషల్‌ మీడియా యాప్‌లలో ఉపయోగిస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే మనం అడిగిన ప్రశ్నలకు అటు వైపు ఉన్న కంప్యూటరే ఆన్సర్‌ చేస్తుంది. ఇది ఛాట్‌బోట్‌. దీనికి వంద రెట్లు అడ్వాన్స్ మోడలే ఛాట్‌ GPT. ఛాట్ GPT అంటే ఏంటో చూద్దాం. ఛాట్‌ అంటే మాట్లాడడం అని అందరికీ తెలుసు. GPT అంటే జెనరేటివ్‌ ప్రీ ట్రైన్డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌. అంటే అర్థం.. మనం అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్‌ని ముందుగానే ఆ సిస్టమ్‌లో సెట్‌ చేయడం. అంటే కంప్యూటర్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా ముందుగానే క్వశ్చన్స్‌కి ఆన్సర్స్‌ని ఇచ్చేలా ట్రైన్‌ చేయడం. సపోజ్‌… భారత రాజధాని ఏది అని మనం అడిగాం అనుకోండి… ఈ క్వశ్చన్‌, అందుకు ఆన్సర్‌గా ఢిల్లీ రెండూఛాట్ GPTలో అల్రెడీ లోడ్‌ చేసి ఉంటాయి. అలా 2021 వరకు ఉన్న సమాచారం అంతా ఈ ఛాట్ GPTలో సేవ్‌ చేశారు. ఇంకా అప్‌డేట్‌ చేస్తున్నారు. సపోజ్‌ 2022లో ఉన్న అప్‌డేట్స్‌ గురించి అడిగితే మాత్రం ఛాట్ GPT ఆన్సర్ ఇవ్వదు. త్వరలోనే ఛాట్‌ GPTకి ఇంటర్‌నెట్‌ యాక్సిస్‌ కూడా ఇస్తారు. ఆ తర్వాత ఛాట్ GPTకి ఆకాశమే హద్దు.

గూగుల్‌లో మనం ఏదైనా వర్డ్‌ సెర్చ్ చేసినప్పుడు దానికి సంబంధించిన వెబ్‌ లింక్‌లన్నీ చూపిస్తుంది. వాటిలో మనకు కావాల్సింది వెతుక్కోవాలి. అదే ఛాట్ GPTలో మాత్రం ఈ లింకులేమీ ఉండవు. పర్టిక్యులర్‌ ఆన్సర్‌ని స్పష్టంగా ఇస్తుంది. ఉదాహరణకు నరేంద్ర మోడీ అని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే చాలా లింక్స్‌ వస్తాయి. కానీ ఛాట్ GPTలో నరేంద్ర మోడీ అని టైప్‌ చేస్తే.. కొన్ని లైన్స్‌లో ఒక్క స్ట్రైట్‌ ఆన్సర్‌ మాత్రమే వస్తుంది. ఇక్కడే ఛాట్ GPT క్లిక్‌ అయింది. ఛాట్‌ GPT కూడా గూగుల్‌ లాగే ఉంటుంది. chat.openai.com వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి రిజిస్టర్‌ అయితే గూగుల్‌ లాగే ఒక సెర్చ్‌ బార్‌ వస్తుంది. అందులో ఏది టైప్‌ చేసినా సింగిల్‌ ఆన్సర్‌లో వివరంగా చెప్తుంది. ఇందులో ఎంత లాభం ఉందో, అంతే నష్టం కూడా ఉందంటున్నారు. ఉదాహరణకు ఛాట్‌ జీపీటిలో ఒక మ్యాథ్స్ ప్రాబ్లెమ్‌ అడిగితే మొత్తం సోల్యూషన్‌తో సహా డీటైల్డ్‌గా ఆన్సర్ ఇస్తుంది. అంటే ఎగ్జామ్‌లో మనం రాసే ఆన్సర్‌ ఏజ్‌టీజ్‌గా వచ్చేస్తుంది. కాపీ పేస్ట్‌ చేసుకోవచ్చు. ఇది చూసే చాలా యూనివర్సిటీలు, పేరెంట్స్ కూడా భయపడుతున్నారు. ఛాట్ GPT వల్ల కాపీయింగ్‌ ఇబ్బందులు వస్తాయన్న భయాలు ఉన్నాయి. ఛాట్ GPTని స్టూడెంట్స్ మిస్‌ యూజ్‌ చేయడం కూడా స్టార్టయింది. ఎగ్జామ్స్‌లో మాల్‌ ఫంక్షన్స్‌కి ఛాట్ GPT వల్ల ఇబ్బందులు లేకపోలేదు. ఎగ్జామినేషన్‌ సెంటర్లలో ఫోన్స్ ఎలో చేయకపోయినా… క్వశ్చన్‌ ఆన్సర్స్‌ని స్లిప్స్‌ రూపంలో తీసుకెళ్లే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. ఇందులో ప్లస్‌ ఉంది, మైనస్‌ కూడా ఉంది. కానీ… అడిగిన ప్రశ్నకు ఖచ్చితమైన ఆన్సర్ ఇవ్వడమే ఈ ఛాట్ GPTలో అద్భుతం. ఇప్పుడిప్పుడే ఛాట్ GPTలో ప్రమాదకరమైన ప్రశ్నలను గుర్తించి వాటికి ఆన్సర్స్‌ రాకుండా ఫిక్స్‌ చేస్తున్నారు. ఇంకా అప్‌డేటింగ్ వర్షన్స్ కూడా వస్తున్నాయి. ఇవన్నీ చూసే గూగుల్‌ భయపడుతోంది. నేరుగా ఆన్సర్‌ చెప్పే ఛాట్ GPTవైపు యూత్‌ బాగా అట్రాక్ట్‌ అవుతున్నారు. అయితే ఇప్పటి వరకు 2021 వరకు మాత్రమే ఇన్ఫర్మేషన్‌ని ఛాట్ GPTలో ప్రీ-ట్రైన్‌ చేశారు. అప్పటి వరకే అది సమాధానాలు చెప్తుంది. ముఖ్యంగా ఇప్పటివరకు ఇది ఇంటర్‌నెట్‌ నుంచి సమాచారం తీసుకోదు. ప్రీ-ట్రైన్‌ చేసిన సర్వర్‌ నుంచే ఆన్సర్సే చెప్తుంది. ఒక వేళ

2022 తర్వాత ప్రశ్నలు అడిగితే ఛాట్ GPTలో ఐ డోంట్‌ నో అనే ఆన్సర్ వస్తుంది. ఛాట్ GPTకి త్వరలో ఇంటర్‌ నెట్‌ సహాయం ఇవ్వబోతున్నారు. అది గనక ఇస్తే ఛాట్ GPTని తట్టు కోవడం గూగుల్‌కి కష్టమే. భవిష్యత్తులో ఛాట్ GPTని ఆపడమూ కష్టమే. అందుకే దీనికి పోటిగా గూగుల్‌ బార్డ్‌ అనే ఛాట్‌బోట్‌ని దింపుతోంది. అలాగే చైనా సెర్చ్‌ ఇంజిన్ బైదూ అలాగే అమెజాన్ కూడా ఈ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఛాట్‌బోట్‌ల రేసులో ఉన్నాయి. కస్టమర్ కేర్ సిస్టమ్‌లో ఛాట్ GPT గొప్ప సంచలనం. హెల్త్‌, కస్టమర్‌ సర్వీస్‌, ఎడ్యుకేషన్‌ ఈ వ్యవస్థల్లో ఛాట్ GPT రివల్యూషనరీ ఛేంజ్‌ తీసుకురాబోతోంది. అలాగే హ్యాకర్స్‌ ఈ ఛాట్ GPTని మిస్‌ యూజ్‌ చేసే ప్రమాదాలు ఎక్కువే. గూగుల్‌ తర్వాత ఆ స్థాయిలో ఒక సెర్చ్ ఇంజిన్‌ గురించి చర్చ జరగడం ఛాట్ GPT వల్లే అని చెప్పొచ్చు. కానీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అంటే అర్థం కంప్యూటర్‌ ఆలోచిస్తోంది అని. మన ఆలోచనల ప్రకారం రోబో నడిస్తే మంచిదే, కానీ రోబోనే ఆలోచించడం మొదలు పెడితే నియంత్రించడం కష్టం. ఈ కథతో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. అందుకే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ శకం ఈ ఛాట్‌ GPT, గూగుల్ బార్డ్‌తో ప్రజల్లోకి వచ్చినా.. నియంత్రణ లేకపోతే AI వల్ల వచ్చే సమస్యలు అంతే కఠినంగా ఉంటాయి.

ఛాట్‌ GPTతో సంచలనం సృష్టించిన అమెరికన్‌ సంస్థ OPEN AIకి పెద్ద చరిత్రే ఉంది. ఈ సంస్థకు గ్రెగ్‌ బ్రాక్‌మాన్‌ ఛైర్మన్‌. శామ్‌ ఆల్ట్‌మ్యాన్‌ CEO. 2015లో ఈ సంస్థ ఆపరేటింగ్‌లో ఉంది. 2018 వరకు ఈ సంస్థలో ఎలన్‌ మస్క్‌ పెట్టుబడులు పెట్టాడు. ప్రస్తుతం ఎలాన్‌ మస్క్‌ ఆ సంస్థలో లేకపోయినా డోనర్‌గా ఉన్నాడు.

అలాగే మైక్రోసాఫ్ట్‌ 2019లో ఒక బిలియన్, 2023అంటే రీసెంట్‌గా 10 బిలియన్ల పెట్టుబడులు పెట్టింది. అంటే ఈ ఛాట్‌ GPTతో మైక్రోసాఫ్ట్‌కే కాదు, ఎలన్‌ మస్క్‌కి కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అంటే గూగుల్‌కి గట్టి కౌంటర్‌ ఇచ్చేందుకే ఈ ఛాట్‌ GPT పక్కా ప్లాన్‌తో మార్కెట్‌లోకి వచ్చిందని తెలుస్తోంది.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *