May 30, 2023

ఒకరికే షేరింగ్‌- ఫేక్‌ న్యూస్‌ కట్టడికి వాట్సాప్‌ చర్యలు

ఒకరికే షేరింగ్‌- ఫేక్‌ న్యూస్‌ కట్టడికి వాట్సాప్‌ చర్యలు

కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇలాంటి సమయంలో ఫేక్‌ న్యూస్‌లు మరింత భయపెడుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో ఫేక్‌ న్యూస్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి. నిమిషాల్లో లక్షల మందికి షేర్‌ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇది మంచిది కాదు. అందుకే వాట్సాప్‌ చర్యలు మొదలుపెట్టింది. ఇక మీదట ఏ మెసేజ్‌ అయినా ఒకసారి ఒకరికే షేర్‌ అయ్యే విధంగా ప్రోగ్రామ్‌ డిజైన్ చేసింది.ఇప్పటి వరకు ఒక మెసేజ్‌ని ఒకేసారి ఐదుగురికి షేర్‌ చెయ్యొచ్చన్న విషయం తెలిసిందే. ఫేక్‌ మెసేజ్‌లు, వీడియోలను అడ్డుకునేందుకే ఇలాంటి చర్యలు తీసుకున్నామని వాట్సాప్‌ సంస్థ చెప్పింది. వచ్చిన మెసెజ్‌ రియలా, ఫేకా అన్నది కూడా ఇకపై వాట్సాప్‌లో చెక్‌ చేసుకోవచ్చు. ఇందుకు ఆ మెసెజ్‌లపై మాగ్నిఫయింగ్‌ గ్లాస్‌ ఇమేజ్‌ ఉంటుంది. ఈ సదుపాయం త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. కనుక ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకుని మాత్రమే మెసేజ్‌లు షేర్‌ చేయండి. అనవసరంగా చిక్కుల్లో పడకండి.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *