June 3, 2023

ఆ ఏముంది అంతకు ముందు ఆఫీసర్‌ అని ఏదో అర్థం లేని సినిమా ఒకటి వచ్చింది. పైగా అలనాటి ట్రెండ్ సెట్టర్‌ శివ కాంబో… రాము-నాగ్‌ మ్యాజిక్‌ మళ్లీ రిపీట్‌ అవుతుందని వాళ్లు అనుకున్నారు గానీ జనం అనుకోలేదు. ఆఫీసర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్న రోజే రిటైరైపోయాడు. ఎప్పుడో 2016లో సోగ్గాడే చిన్ని నాయినా తర్వాత నాగార్జునకి సరైన హిట్టే లేదు. వయసూ అయిపోతోంది. మధ్యలో బిగ్‌ బాస్‌ అని ఏవేవో సినిమాలని చేస్తూ పోయారు నాగార్జున. ఆల్‌మోస్ట్‌ సినిమాలు వదిలేశారు అనుకునేలోపు మళ్లీ సినిమాలు చేశారు. అన్నీ ఫ్లాపులే. ఓమ్‌ నమో వేంకటేశాయ, రాజుగారి గది 2, ఆఫీసర్‌, దేవదాస్‌, ముచ్చటపడి చేసిన మన్మథుడు 2 అన్నీ ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో కూడా తెలీదు. ఇక లేటు వయసులో నాగ్‌ సినిమా కెరీర్‌కి డీసెంట్‌ హిట్‌ లేకుండా పోయింది. కానీ… కానీ.. ఇప్పుడీ వైల్డ్‌డాగ్‌ ప్రోమో చూస్తుంటే ఏదో జరిగేట్టే ఉంది. అఫ్‌కోర్స్‌… ఇప్పటికే వచ్చిన వెబ్‌సిరీస్‌లు ఫ్యామిలీ మ్యాన్‌, స్పెషల్‌ ఆప్స్‌ లాంటి షేడ్స్‌ కనిపించినా… దేశభక్తి అనే కాన్సెప్ట్‌ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఇందులో నాగ్‌ కూడా చాలా యాక్టివ్‌గా కనిపించారు. ఉగ్రవాదం కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమాపై నాగ్‌ కూడా ఆశలు పెట్టుకున్నారు. నాగార్జున పక్కన దయామిర్జా, బాలివుడ్‌లో మంచి గుర్తింపు పొంది ఇలాంటి వారియర్‌ పాత్రలు బాగా చేసే సయామి ఖేర్‌, అతుల్‌ కులకర్ణి, లాంటి యాక్టర్లు. మొత్తానికి స్క్రీన్‌ అప్పీయరెన్స్‌ అయితే బాగుంది. చూద్దాం.. ఈ సారి వైల్డ్‌ డాగ్‌ వేట ఎంత డాషింగ్‌ ఉంటుందో…

About Author

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *