ప్రపంచ కుబేరుల్లో 8వ స్థానంలో ముఖేష్ అంబానీ. ప్రపంచంలో టాప్ రిచెస్ట్ పర్సన్ ఎలన్ మస్క్. 2021 హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రపంచ కుబేరుల జాబితా విడుదల చేసింది. చైనాకి చెందిన ఆ సంస్థ ఫోర్బ్స్‌లానే ఏటేటా కుబేరుల జాబితా అనౌన్స్ చేస్తుది. ఆ లిస్ట్ ప్రకారం RIL అధినేత ముఖేష్ అంబాని సంపద 83 బిలియన్లు. ప్రతీ ఏడాది అంబానీ ఆస్తి 24 శాతం పెరుగుతోంది. ఆయన పట్టిందల్లా బంగారమే అవుతోంది. టెలికామ్, ఎనర్జీ రంగాల్లో ముఖేష్‌కి తిరుగులేకుండా పోయింది. జియో వచ్చాక RIL దశ దిశ మారిపోయాయి.
హురూన్ సంస్థ రిపోర్ట్ ప్రకారం దేశం మొత్తం ఎగుమతుల్లో 8 శాతం RIL కంపెనీవే. కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డ్యూటిల్లో 5 శాతం రిలయన్స్ కంపెనీ నుంచే వస్తున్నాయి. గత ఏడాది హురూన్ సంస్థ కుబేరుల జాబితాలో ముఖేష్ ప్లేస్ 9. ఈ సారి మరో అడుగు ముందుకు వేశారు. మొత్తంగా 177 మంది బిలియనీర్లతో ప్రపంచంలో ఎక్కువ మంది కుబేరులున్న దేశాల్లో ఇండియా మూడో స్థానంలో నిలిచింది. బిలియనీర్స్ క్యాపిటల్‌గా ముంబైని వర్ణించిన హురూన్ సంస్థ. ముంబైలో 61 మంది బిలియనీర్లు, ఢిల్లీలో 40 మంది ఉన్నారు. భారత్‌కే చెందిన మరో 32 మంది బిలియనీర్లు వివిధ దేశాల్లో నివసిస్తున్నారు. వంద మంది కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ కుటుంబం 48వ స్థానంలో ఉంది.
ఇక ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్. టెస్లా, స్పేస్ట్ ఎక్స్ కంపెనీల నిర్వహణతో ఎలన్ మస్క్ ఎదురులేని కుబేరుడయ్యారు. ఎలన్ మస్క్ సంపద 197 బిలియన్లు. 2020 కరోనా సమయంలోనూ ఎలన్ మస్క్ సంపద అతని రాకెట్‌లాగే దూసుకుపోయింది. ఎప్పుడూ కుబేరుల లిస్ట్‌లో మొదట ఉండే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఈ సారి ఒక అడుగు కిందకు దిగారు. రెండో ప్లేస్‌తో సరిపెట్టుకున్నారు.జెఫ్ బెజోస్ సంపద 189 బిలియన్లు.
2020లో వారానికి 8 మంది బిలియనర్లుగా ఎదిగారని ఆ సంస్థ చెప్తోంది. ఈ లిస్ట్‌లో 4,5 స్థానాల్లో బిల్ గేట్స్, ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ ఉన్నారు. ఆరో స్థానంలో వారెన్ బఫెట్ ఉన్నారు.