June 7, 2023

లాక్‌డౌన్‌లో సినిమా ఎలా తీయాలి? – C U SOON చూడండి

లాక్‌డౌన్‌లో సినిమా ఎలా తీయాలి? – C U SOON చూడండి

ఒక యాపిల్‌ డెస్క్‌ టాప్‌, రెండు ఫోన్‌లు, నాలుగు యాప్‌లు, ఓ పది వీడియో కాలింగ్‌లు, మూడు మెయిన్‌ క్యారెక్టర్లు మధ్యలో ఓ థ్రిల్లింగ్‌ స్టోరీ. ఇదే అమెజాన్‌లో నేరుగా విడుదలైన మళయాళం మూవీ C U SOON కథ. లాక్‌డౌన్‌లో స్మాల్‌ బడ్జెట్‌లో సినిమా ఎలా తీయాలో మళయాళం స్టార్‌ ఫాజిల్‌ని అడిగితే తెలుస్తుంది. ఐఫోన్‌తో హాలివుడ్‌ స్థాయిలో సినిమా ఎలా తీయొచ్చో మహేష్‌ నారాయణ్‌ని అడిగితే చెప్తాడు. C U SOON సినిమా మంచి థ్రిల్లర్‌. సినిమాలో చాలా భాగం ఐఫోన్‌తో తీశారు. ఒకటి రెండు సీన్లలో తప్పఎక్కడా ఒక క్యారెక్టర్‌ మరో క్యారెక్టర్‌తో కలవరు. తెల్లారితే వాట్సాప్‌ చూడకుండా పక్క మీద నుంచి లేవం, ఫేస్‌బుక్‌ పోస్ట్‌కి ఎన్ని లైక్‌లు వచ్చాకో లెక్కపెట్టాకే ఛాయ్‌ తాగుదాం. నచ్చిన వాళ్లతో వీడియో కాలింగ్‌ ఈ రోజుల్లో కామన్‌. ఆన్‌లైన్‌ క్లాసులు వచ్చాక వీడియో కాల్‌ జీవితంలో భాగమైపోయింది. జస్ట్‌ ఈ మూడు అంశాలతో తీసిన అద్భుతమైన సినిమా C U SOON. ఫదా ఫాజిల్‌ సినిమా అంటే మరో ఆలోచన లేకుండా చూసేయొచ్చు. దుబాయ్‌లో ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ అమ్మాయి, దుబాయ్‌లోనే అబ్బాయి. ఆన్‌లైన్‌ ప్రేమ. మధ్యలో అబ్బాయి ఫ్రెండ్‌ ఓ ఎథికల్‌ హ్యాకర్‌. అనుకోకుండా ఓ సంఘటన. ఆ తర్వాత అబ్బాయి ఇబ్బందుల్లో పడతాడు. మిగిలిన కథంతా ఓ యాపిల్‌ సిస్టమ్‌ ముందు కూర్చుని ఫాజిల్‌ నడిపేశాడు. గంటన్నర సినిమాలో దాదాపు ముప్పావు గంట సేపు ఫాజిల్‌సిస్టమ్‌ ముందే కూర్చుంటాడు. అయినా ఒక్క సెకను కూడా బోరు కొట్టదు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు తీసున్న ఫాజిల్‌.. ఇలాంటి క్యారెక్టర్లు ఇరగదీసేస్తాడు. ఇలాంటి సినిమా తీయాలంటే చాలా కాన్ఫిడెన్స్‌ ఉండాలి. ముఖ్యంగా లాక్‌డౌన్‌లో ఎలా సినిమాలు తీయాలో అర్థం కాక అందరూ బుర్రలు పీక్కుంటేఫాజిల్‌ జస్ట్‌ ఒక గదిలో సినిమా మొత్తం కానిచ్చేశాడు. దీనికి నిర్మాత ఫాజిల్‌, ఆయన భార్య నజ్రియా. కథ చెప్పేస్తే థ్రిల్‌ ఉండదు. సోషల్‌ మీడియా రెండువైపులా పదునున్న కత్తి అని చెప్తూనే, మంచి ప్రేమ కథనూ చూపించారు. ప్రైవసీ అన్న ఆప్షన్‌ ఒట్టి అబద్ధమని ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది. రోజూ వార్తల్లో చూస్తుంటాం. ఫేస్‌బుక్‌ మోసాలు, ఆన్‌లైన్‌ చీటింగ్‌లు అని. అలా అని ఇప్పుడున్న ఈ టెక్నాలజీ లేకపోతే ఈ ప్రపంచమే లేదన్న విషయాన్నీ చూపించాడు దర్శకుడు. కీలక పాత్రలో రోషన్‌ మాథ్యూ దుమ్ము దులిపేశాడు. హీరోయిన్‌ పాత్రలో వేసిన దర్శనా రాజేంద్రన్‌ చాలా కాలం గుర్తుండిపోయే నటన చూపించింది. అసలీ సినిమాని ఐఫోన్‌లో ఎలా తీశారన్నది మిస్టరీ. అందులోనూ సినిమాలో చాలా భాగం వర్చువల్‌ సినిమాటోగ్రఫీ టెక్నాలజీతో తీశారు. మొత్తం సినిమా అంతా మనం రోజూ చూసే ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, గూగుల్‌ డియో, ట్విట్టర్‌, వెబెక్స్‌.. ఇలా అన్ని సోషల్‌ మిడియా యాప్‌లనూ వాడేశారు. ఈ మూవీని ఎక్కడా బోర్‌ కొట్టకుండా డైరెక్ట్‌ చేసిన మహేష్‌ నారాయణ్‌కి హాట్సాఫ్‌. ఈ సినిమాకి కథ, ఎడిటింగ్‌ కూడా మహేష్‌ నారాయణే. హాలీవుడ్‌లో ఇలాంటి సినిమాలు ఒకటి రెండు వచ్చాయి. జస్ట్ గంటన్నరలో అయిపోయే C U SOON… ఒక డిఫరెంట్‌ వరల్డ్‌లోకి తీసుకెళ్తుంది.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *