June 7, 2023

నోరు మంచిదైతే…

నోరు మంచిదైతే…

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. లేకపోతే ఏం జరుగుతుందో కత్తి మహేశ్‌ని అడిగితే బాగా చెప్తారు. వాదన తప్పుకాదు, వితండ వాదన మాత్రం తప్పు. కత్తి రెండో రకం. ఆయనో సినిమా తీశారు కానీ గుర్తింపు రాలేదు. సినిమాల్లో నటించారు అయినా గుర్తింపు రాలేదు. ఫిల్మ్‌ క్రిటిక్‌గా జనానికి కొద్దిగా పరిచయమయ్యారు. బిగ్‌బాస్‌ షోతో తెలిశారు. ఆ పాపులారిటీ అతనికి సరిపోలేదు. ఐడెంటిటీ క్రైసిస్‌ హద్దులు దాటితే ఎలా ఉంటుందో కత్తి మహేశ్‌ని ఎక్సాంపుల్‌గా చూపిస్తే సరిపోతుంది. ఆ క్రైసిస్‌తోనే అనుకుంటా పవన్‌పై విమర్శలు. పవన్‌ పైనే ప్రత్యేక భావ ప్రకటనఎందుకో మరి ! ఏదైతేనేం.. పవన్‌ అభిమానులకుకత్తి మహేష్‌ విలన్‌ అయ్యాడు. నిజానికి కత్తి మహేశ్‌ జనాలకు తెలిసింది పవన్‌పై ఆయన చేసిన విమర్శలతోనే. అంతవరకు చాలా మందికి కత్తి మహేశ్‌ ఎవరో కూడా తెలీదు. ఎప్పుడైనా నెగటివ్‌ పాపులారిటీ చాలా స్పీడ్‌గా స్ప్రెడ్‌ అవుతుంది. ఆ పాపులారిటి బ్రేకుల్లేని హై స్పీడ్‌ వెహికల్‌ లాంటింది. ఎప్పుడో అప్పుడు యాక్సిడెంట్‌ కాక తప్పదు. అదే జరిగింది ఇప్పుడు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఓ ఛానల్‌ ఆయన్ను బాగా ఎంకరైజ్‌ చేసింది. రేటింగుల కోసం వివాదాల షోల స్థాయికి కొన్ని ఛానెళ్లు దిగజారిపోయాయి. పవన్‌ని విమర్శించి విమర్శించి విసుగొచ్చిందో ఏమో.. ఈ సారి ఏకంగా రాముడి పైనే కామెంట్స్‌ చేశాడు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మరొకరి భావోద్వేగాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదు. కానీ, కత్తి నోరు అదుపు తప్పింది. బ్రేకుల్లేని హై స్పీడ్‌ కారు బోల్తా కొట్టింది. వేల ఏళ్ల నుంచి భారతీయులు పూజిస్తున్న రాముడిని అవమానించడం, ఎంతో మంది నమ్మకాలను అపహాస్యం చేయడం కత్తికి తప్పనిపించలేదు. ఆయన్ను ఎవరైనా విమర్శిస్తే.. వెంటనే ఆయనకు తప్పనిపించేస్తుంది. కులాన్ని బయటకు తీస్తారు. ఆయన మాత్రం త్రేతాయుగం నుంచి కలియుగం వరకు ఎవరిపైనైనా తన భావం ప్రకటించేస్తారు“. అది ఎంత చెత్త భావమైనా. ఇదంతా కావాలనే చేస్తున్నట్టే కనిపిస్తుంది. కత్తి మహేశ్ భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకోలేదు. దుర్వినియోగం చేశారు. కనుకే, ఇప్పుడు బహిష్కరణ శిక్షను అనుభవిస్తున్నారు. ఇప్పుడు కూడా అతనేదో రచ్చకు ప్రిపేర్‌ అయ్యే ఉంటాడు. లేదా ఎవరైనా వెనకుండి ప్రిపేర్‌ చేయిస్తూ ఉండవచ్చు. అయినాఆయన తన వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా సభ్య సమాజానికి ఏ మెసేజ్‌ ఇద్దామని… !!! టీవీల్లో, సోషల్‌ మీడియాల్లో కనిపించి ఏదో ఒక వివాదాన్ని కెలుక్కునిఆడియన్స్‌ని, నెటిజన్స్‌ని చిరాకు పెట్టడం తప్ప కత్తి సాధించిందేమీ లేదు.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *