June 7, 2023

రైతుకి చల్లని కబురు-రూ.200 పెరిగిన వరి మద్దతు ధర- కేంద్రం నిర్ణయం

రైతుకి చల్లని కబురు-రూ.200 పెరిగిన వరి మద్దతు ధర- కేంద్రం నిర్ణయం

రైతన్నకు శుభవార్త. అన్నదాతలకు ఆర్థిక చేయూతనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఈ ఏడాది ఫిబ్రవరి 12018 బడ్జెట్‌ను ప్రవేశ పెడుతూ.. రైతులకు ఉత్పత్తి ధరకంటే 1.5 రెట్లు అధికంగా మద్దతు ధర చెల్లిస్తామని ప్రకటించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళఆ హామీ నెరవేర్చేందుకుకేంద్రం రైతులకు చల్లని కబురందించింది. వరిపంటపై కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు 200 రూపాయలు పెంచుతున్నట్టు ప్రకటించింది. అంతేకాదు ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలున్నాయి. ఫలితంగా ఆహారోత్పత్తి గణనీయంగా పెరుగుతాయి. వరితో పాటు ఈ ఏడాది 14 రకాల ఖరీఫ్ పంటలపై కనీస మద్దతు ధర పెంచేందుకు ఆర్ధిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) ఆమోదం తెలిపింది. పెరిగిన ధరతో కలిపి వరి సాధారణ రకం కనీస మద్దతు రూ.1,750కి చేరుకుంది. గ్రేడ్ఎ రకం క్వింటాల్‌కు రూ. 1,750కి చేరింది. మిగిలిన పంటలకు పెరిగిన కనీస మద్దతు ధరలు దిగువ పట్టికలో చూడవచ్చు.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *