మాంచి హాటుగా హీటుగా ఏపీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ సారి ఏపీలో త్రిముఖ పోరు మాంచి జోరుగా సాగింది. రాష్ట్రం మొత్తం ఇంట్రస్టింగ్‌గా చూసిన పార్టీ జనసేన.
రిజల్ట్‌లో జనసేన ప్లేస్ ఎక్కడ? ఎన్ని సీట్లు కొడుతుంది? అన్న విషయంపైనే ఇప్పుడు డిస్కషన్. కనీసం పాతిక నుంచి 30 సీట్లు జనసేనకి వస్తాయని ఆ పార్టీ వర్గాల అంచనా. నిజంగా అన్ని సీట్లు వస్తే ఏపీ రాజకీయాలు ఎలా మారొచ్చు? పవన్ దారెటు? కింగ్ అవుతాడా? కింగ్ మేకర్ అవుతాడా? ఏపీలో ఎన్నికలు ముగిశాయి. పార్టీలన్నీ ఎవరికి వారు తమదే గెలుపు అంటున్నారు. అయితే ఈ సారి అనూహ్యంగా త్రిముఖ పోరులో జోరుగా వచ్చాడు జనసేనాని. పవన్ కల్యాణ్ ఈ సారి రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనం. నో డౌట్. పోటీ టీడీపీ– వైసీపీ మధ్యే అనుకున్న వారికి షాకుల మీద షాకులిచ్చారు పవన్. 2014లో ప్రశ్నించే పార్టీగా అవతరించిన జనసేన.. టీడీపీకి సపోర్ట్ ఇచ్చారు. ఆనాడు టీడీపీ విజయానికి పవన్ మేజర్ సపోర్ట్. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన పవన్.. నెమ్మదిగానే అడుగులేసినా.. ఆ తర్వాత వేగం పెంచారు. అనుభవం ఉన్న లీడర్లతో పార్టీని ఎన్నికల బరిలో హాట్ ఫేవరేట్‌గా మార్చారు. వామపక్షాలను మాత్రం దగ్గరకు తీసుకున్న పవన్… ఇంకే పార్టీతోనూ పొత్తులు పెట్టుకోకుండా సింగిల్ ఫైట్‌కే వెళ్లారు. అన్ని స్థానాల్లో పోటీ చేశారు. సుడిగాలి ప్రచారాలు చేసి తన మార్కు ప్రసంగాలతో హిట్ టాక్ తెచ్చుకున్నా… అవి ఓట్లుగా మారాయా? ఎక్కడికి వెళ్లినా భారీగా హాజరైన జనం, యువత పోలింగ్ బూత్ వరకు వచ్చారా? వచ్చిన వారు… ఈవీఎంలలో పవన్‌కి ఓటేశారా? ఇవన్నీ మే 23 వరకు సస్పెన్సే. కానీ.. గ్రౌండ్ లవెల్లో అప్పుడే డిస్సషన్స్ మొదలైపోయాయి. ఓట్ పర్సంట్‌లను బట్టి లెక్కలు వేస్తున్నారు… పార్టీల కార్యకర్తలు. ఈ సారి భారీగా 78 శాతం ఓటింగ్ జరిగింది. అతి తక్కువ ఓటర్లున్న విజయనగరం లాంటి జిల్లాల్లో కూడా 80 శాతం పైగా ఓటింగ్ నమోదైంది. ఇంత భారీ ఓటింగ్ జరిగిందంటే సాధారణంగా యాంటి గవర్నమెంట్ ట్రెడిషన్ అంటారు. కానీ.. ఆ యాంటీ గవర్నమెంట్ ఓటు ఎవరికి వెళ్లింది? జగన్‌కి మాత్రమే వెళ్లిందా? పవన్‌కి కూడా వెళ్లిందా? ఖచ్చితంగా చెప్పలేం. అయితే ఎకార్డింగ్ టూ రిలయబుల్ సోర్సస్… జనసేన విషయంలో టీడీపీ, వైసీపీ వేసుకుంటున్న లెక్కలు రివర్స్ అవుతున్నాయి. అది ఎంతవరకో చూడాలి. ఇవన్నీ ఒకెత్తు. ఒకవేళ జనసేనకు ఎన్ని సీట్లొస్తాయి? ఒక వేళ వస్తే.. జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటి అన్న చర్చ ఇంట్రస్టింగ్‌గా మారింది.
ఈ సారి ఏపీ ఎన్నికల రిజల్ట్ ప్రెడిక్ట్ చేయడం ఎవరి తరం కాలేదు. సర్వేలు, ఆ తర్వాత ఎవరికి వారు వేసుకుంటున్న కాకి లెక్కలు అంతా ట్రాష్. ఈ సారి ఓటరు అందరికి మాంచి కిక్కు ఇచ్చాడు. ఎక్కడా క్లియర్ రిజల్ట్ అంచనా వేసే పరిస్థితి లేదు. 78 శాతం ఓటింగ్‌లో ఎవరికి ఎంత పర్సంటో డిసైడ్ చేయడం అంత ఈజీ కాదు. ఎవరికి వారు మాకు వందొస్తాయి అంటే మాకు వందొస్తాయి అని చెప్పుకోవడమే కాని.. ఏ పార్టీకి వంద మార్కు వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక జనసేన విషయానికి వస్తే… ఈ సారి ఎన్ని సీట్లొస్తాయి..? జనసేన కార్యకర్తలు చెప్తున ఫిగర్
20 నుంచి 30 సీట్లు. నిజంగా అన్ని సీట్లొస్తే… పవన్‌కి తిరుగులేదు. కింగ్ మేకరే. ఎందుకంటే జనసేనకు పాతిక సీట్లు వస్తే… మిగిలిన 150లో టీడీపీ, వైసీపీ మేజిక్ ఫిగర్ రీచ్ అయ్యే పరిస్థితి ఉండదు. పవన్ సపోర్ట్ లేకుండా గవర్న్‌మెంట్ ఫామ్ చేయడం కుదరదు. అలాంటి పరిస్థితి వస్తే… జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనమే. ఏమో కర్నాటక లాంటి ఈక్వేషన్స్ రిపీట్ అయితే… పవన్ ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి సమయంలో పవన్ ఎటువైపు వెళ్తారు? టీడీపీ వైపా, వైసీపీ వైపా? టీడీపీకి గతంలో సపోర్ట్ ఇచ్చి చంద్రబాబు గెలుపు కోసం శ్రమించారు. ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు… రిజల్ట్ వచ్చాక.. పవన్‌ని వదిలేశారు చంద్రబాబు. సెల్ఫిష్ పాలిటిక్స్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రబాబుతో దోస్తీ ఎప్పటికైనా ప్రమాదమే అంటున్నారు జనసేన కార్యకర్తలు. జగన్‌తో అలాంటి జగడాలు రావని గ్యారెంటీ ఏంటి.
అయినా 30 సీట్లు వస్తే… డెసిషన్ చాలా క్లియర్‌గా ఉండాలి. ఏది ఏమైనా… జనసేనకు 30 వరకు సీట్లు వస్తే… మద్దతు విషయంలో పవన్ ఆచి తూచి అడుగేయాలనే అంటున్నారు. పవన్‌కి 30 వరకు వచ్చి టీడీపీ గానీ, వైసీపీ గాని మేజిక్ ఫిగర్‌ని అందుకున్నా పవన్‌కి వచ్చే నష్టమేమీ లేదు. ప్రతిపక్ష పాత్రంలో టీడీపీ గానీ, వైసీపీ గానీ రెండూ ఫెయిలే. వైఎస్ ఉన్నప్పుడు పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నిర్ణయాత్మక పాత్ర పోషించలేకపోయారు. అలాగే చంద్రబాబు ప్రభుత్వంలో జగన్ కూడా ప్రతిపక్షంగా పూర్తిగా ఫెయిల్. అసెంబ్లీనే బాయికాట్ చేసి.. ప్రతిపక్షం మూగబోయేలా చేసిన నాయకుడు జగన్. కనుక ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలు చాలా వీక్ కాబట్టి.. అది పవన్‌కి కలిసొస్తుంది. పవన్ సమస్యలపై తనదైన శైలిలో గళమెత్తగలరు. ఒక్క సీటు గెలిచినా చాలు… అసెంబ్లీలో సమస్యలను ప్రశ్నిస్తా అని పవన్ గతంలో అన్నారు. అలాంటిది పాతిక నుంచి 30 సీట్లు వస్తే జనసైనికుల ప్రశ్నల అస్త్రాలతో అసెంబ్లీ దద్దరిల్లుతుంది. ఇప్పటికే రాష్ట్రమంతా తిరిగిన పవన్‌కి సమస్యలపై పట్టుంది. సమస్యల పరిష్కారానికి గళమెత్తి అధికార పక్షానికి చెమటలు పట్టించగల సత్తా జనసేనకు ఉంది. కనుక ప్రతిపక్ష పాత్రను పెర్‌ఫెక్ట్‌గా యూజ్ చేసుకుంటే 2024 ఎన్నికల్లో జనసేనను అందరూ ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సారి ఎన్నికల్లో జనసేనకు ఓట్లు వేసిన వారిలో ఎక్కువ మంది యువతేనని తెలుస్తోంది. సామాజిక వర్గ పరంగా 40 ఏళ్లు దాటిన కాపులు జనసేనను ఇంకా పూర్తిగా ఓన్ చేసుకోలేనది అర్థమవుతోంది. ఎందుకంటే 40 ఏళ్లు పైబడిన కాపుల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న చాలా నియోజక వర్గాల్లో జనసేనకు క్లియర్ రిజల్ట్ కనిపించడం లేదు. అంటే ఇంకా పార్టీని ఓన్ చేసుకోడానికి టైం పడుతుంది. ఈ ఐదేళ్లలో ఆ నమ్మకం కలిగించగలిగితే…
2024లో పవన్ ముఖ్యమంత్రి కుర్చీకి చాలా దగ్గరవుతారు. 2024 ఎన్నికలకు సిద్ధమవడం పవన్ ముందున్న ఛాయిస్. ఇప్పుడు ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా… 2024 నాటికి జనసేనే ప్రధాన పోటీ దారు అవుతుంది. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే… వైసీపీ పార్టీకి ఇక గడ్డు కాలమే. చంద్రబాబు రాజకీయం ముందు అధికారం లేని జగన్ ఇంకో ఐదేళ్లు నిలబడడం అంత సులువు కాదు. ఒక వేళ వైసీపీ ప్రభుత్వాన్ని నిర్మిస్తే… టీడీపీకి గడ్డు కాలమే. ఇప్పటికే వయసు మీద పడిన చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటూ 2024 నాటి వ్యూహాలు రచించేంత సీను ఉండదు. ఇప్పటికే నారా లోకేశ్‌కి పప్పు ముద్ర పడింది. పార్టీని నడిపించే స్థాయి లోకేశ్ ఉందని తెలుగు తమ్ముళ్లకే నమ్మకం లేదు. మళ్లీ నారా వారి చేతులోంచి నందమూరి చేతుల్లోకి పార్టీ వస్తే.. అంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు బరిలో దిగితే తప్ప… పచ్చ జెండా లేచి రెపరెపలాడే పరిస్థితి ఉండదు. ఈ ఈక్వేషన్స్ పవన్‌కి చాలా అడ్వాంటేజ్. అందుకే టీడీపీ, వైసీపీ ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా మాంచి వయసులో ఉన్న పవన్‌కి లాభమే తప్ప నష్టమేమీ లేదు. పైగా 2024కి జనసేన డబుల్ స్ట్రాంగ్‌గా మారి గట్టి పోటీ అవడం ఖాయం.