June 7, 2023

1 జీబీ డాటా స్పీడ్ తో జియో జిగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ దూకుడు

1 జీబీ డాటా స్పీడ్ తో జియో జిగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ దూకుడు

రిలయన్స్ జియో మరో సంచలనం. ఇక జియో జిగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకుంటే చాలు అరచేతిలో ప్రపంచం ఇమిడిపోయినట్టే. ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలతో శరవేగంగా యూజర్లను కట్టిపడేసేందుకు జియో దూసుకొస్తోంది. రిలయన్స్ సంస్థ 41 వ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబాని ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం జిగా బ్యాండ్ బీటా ట్రయల్స్ నడుస్తున్నాయి. ఆగస్ట్ 15 స్వతంత్ర దినోత్సవం నుంచి మై జియో యాప్, jio.com వెబ్ సైట్ నుంచి జిగా ఫైబర్ కనెక్షన్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. లోకేషన్ వైజ్ గా ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకున్న ప్రాంతానికి ముందుగా జిగా బ్యాండ్ సేవలందిస్తారు. జిగా ఫైబర్ జిగా రూటర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తుంది. 1 జీబీ డాటా స్పీడ్ తో అదిరిపోయే వైఫై నెట్ వర్క్ జిగా బ్యాండ్ సొంతం. శబ్ద నాణ్యతతో కూడిన వాయిస్ కాల్స్- అపరిమిత టీవీ, వీడియో కాలింగ్ మరెన్నో సేవలు జియో జిగా బ్యాండ్. వీటి కోసం యూజర్లు జియో జిగా టీవి సెటప్ బాక్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. జియో జిగా టీవీ సెటప్ బాక్స్ అమర్చిన తర్వాత స్మార్ట్ రిమోట్ కంట్రోల్ మీ వాయిస్ కమాండ్ లను కూడా సపోర్ట్ చేస్తుంది. వెబ్ కామ్ సెటప్ చేసుకుంటే టీవీ నుంచే వీడియో కాలింగ్ కూడా చేసుకోవచ్చు. జిగా ఫైబర్ ఇనిస్టాలేషన్ పూర్తిగా ఉచితమని జియో చెప్తోంది. అయితే జిగా బ్యాండ్ టారిఫ్ వివరాలను ప్రస్తుతం గోప్యంగా ఉంచారు. ఆగస్ట్ 15 తర్వాత ఆ వివరాలు వెల్లడిస్తారు. దేశమంతా జిగా బ్యాండ్ కనెక్టివిటీ కోసం రిలయన్స్ సంస్థ 2,50,000 కోట్లు వెచ్చించినట్టు ముఖేష్ అంబాన్ని ప్రకటించారు.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *