చాలా రోజులుగా సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, అడిగితే.. అది తన భావ ప్రకటన స్వేచ్ఛ అని సమర్థించుకుంటున్నకత్తి మహేశ్‌పై తెలంగాణ పోలీస్ శాఖ గట్టి చర్యలు తీసుకుంది. కత్తి మహేశ్‌పై 6 నెలల పాటు నగర బహిష్కరణ విధిస్తున్నట్టు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ 6నెలల్లో పోలీసుల అనుమతి లేకుండా నగరంలో ప్రవేశిస్తే అరెస్ట్ చేస్తామని, మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందన్నారు. కత్తి మహేశ్ బహిష్కరణ నగరానికా? తెలంగాణ మొత్తానికా? అన్న నిర్ణయంపై ఆలిచిస్తున్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా సమాజంలో అలజడులు రేపితే ఊరుకోమని డీజీపీ హెచ్చరించారు. అలజడి రేపే వ్యాఖ్యలు చేసినవారిపై, వారిని ప్రోత్సహించిన వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు.కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలను ఓ టీవీ ఛానెల్ పదేపదే ప్రసారం చేయడం మంచిది కాదని.. శాంతి భద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించాల్సిన మీడియా ఇలాంటి విషయాల్లో సున్నితంగా వ్యవహరించాలని మందలించారు.
Related Posts
అణువణువూ వేదమే- జీవన వేదం- 1వ భాగం
ప్రశ్న ఎప్పుడూ విజ్ఞానమే. అసలు ప్రశ్న లేకపోతే ప్రపంచం లేదు. ఈ విశ్వం లేదు.
July 1, 2018
కదిలే విశ్వం నుంచి వచ్చే శబ్దమే ప్రణవం- జీవన
అసలు ఓంకారం అనేది ఉందా? మన హైందవ సంప్రదాయంలో ప్రతీ మంత్రం ముందు ఓంకారం
July 1, 2018
వాట్సాప్ పేమెంట్ సర్వీస్… సురక్షితమేనా ?
ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం
July 1, 2018
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్
July 1, 2018
ఆగస్ట్ 27లోగా రాకపోతే… విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే
ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా వేరే
July 1, 2018